పట్టు-పెట్టు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
పట్టు పట్టు పట్టు
నాణ్యమైన పట్టు
మిషన్ పై పెట్టు
బాగానీవు కుట్టు!

పట్టు పట్టు పట్టు
తేనె పట్టు బొట్టు
జోపి నీవు పట్టు
ఉట్టి మీద పెట్టు !

పట్టు పట్టు పట్టు
కలం చేత పట్టు
కవిత రాసి పెట్టు
విప్పు నీవు గుట్టు !

పెట్టు పెట్టు పెట్టు
బొట్టు నీవు పెట్టు
పట్టు చీర కట్టు
గుట్టు దాచి పెట్టు !

కొట్టు కొట్టు కొట్టు
గుడిగంటను కొట్టు
ధూపం వేసి పెట్టు
దీపం నీవు పట్టు !

పట్టు పట్టు పట్టు
నాన్న వేలు పట్టు
బడి బాట పట్టు
 పేరు నిలబెట్టు !

పట్టు పట్టు పట్టు
దేశానికి జై కొట్టు
ప్రతిజ్ఞ నీవు పట్టు
ఫలితం రాబట్టు. !

పట్టు పట్టు ప

ట్టు
పట్నం బాట పట్టు
బడి ఒకటి కట్టు
ధనం కూడబెట్టు !

పట్టు పట్టు పట్టు
గుడి కూడా కట్టు
అన్నదానం పెట్టు
ఉన్న ఉట్టి కొట్టు  !

కామెంట్‌లు