తాతయ్య కథలు-96...:- ఎన్నవెళ్లి రాజమౌళి

 నానమ్మ ఊరికే ఉన్న  ఒక్క మెతుకు గంజిల పడ్డట్టు ఆయే అంటుంది. అంటే ఏమిటి తాతయ్య.
ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఆపదకో, సంపదకో అక్కరకు వస్తాయి అని కొంత డబ్బు పోగు చేసుకున్నప్పుడు-ఏదో కష్టకాలం వచ్చి ఆ పోగు చేసుకున్న నాలుగు రూపాయలు పోతే... ఉన్న ఒక్క మెతుకు గంజిల పడ్డ ట్టాయే అంటూ ఉంటారు.
గంజి అంటే ఏంటి తాతయ్య. అన్నం వుడికిన తర్వాత వంచేదే గంజి.
ఇక్కడ అతిశయం ఉంది. కనీసం ఒక్క మెతుకు అన్నా దొరకకపోతదా.. అనుకున్నప్పుడు ఆ ఒక్క మెతుకు గంజిలో పడి  అక్కరకు రాకుండా పోయింది అన్నమాట. వంద రూపాయల కూలి అన్న దొరకకపోతదా అనుకుంటే... దానికి కూడా  ఎవరో అడ్డు వస్తే.. దొరికిందన్న కూలీ పాయె అని కూడా వాడతారు. బాగా చెప్పావు తాతయ్య అన్నాడు మనవడు.
కామెంట్‌లు