తాతయ్య కథలు-98.. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 నాలుగు కూరలు, చారు, రసం ఇన్ని పదార్థాలు తింటామా.. లేని నాడు పచ్చడి మెతుకులు పెడతావ్. పెట్టినాడు ఇన్ని కూరలా.. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి లా ఉంది నీ పని అని నానితో అంటున్న తాతయ్య తో-
ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అంటే ఏమిటి తాతయ్య అన్నాడు మనవడు.
సంసారం చేయడం ఒక కళ రా.. ఉన్ననాడు పొదుపు చేసుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.
సామెత గురించి చెప్పనేలేదు తాతయ్య.
ఓహో.. అదా... ఉగాది నాడు పంచభక్ష్య పరమాన్నం తో తింటామా... అవును. అలాగే శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు కదా. అవును. అందుకే కే ఈ సామెత వాడుతూ ఉంటారు.
పండుగల అప్పుడేమో ఇది సహజమైనది. ఇదేమో మనం కోరి చేసుకునేది. అవునా-కాదా. అవును తాతయ్య అన్నాడు మనవడు.
కామెంట్‌లు