జీవనరాగం .. !! (ఆన్షి లు )డా . కె ఎల్ వి ప్రసాద్ ,--హన్మకొండ (9855252002)

ఫేస్బుక్ వాట్స్ ఆప్ లు అందరి నోళ్ళలో 
నానుతున్న అంశాలు ఇప్పుడు మనకు 
తెలియని వారిమెసేజ్ పట్ల జరభద్రం సుమా 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము!!

ఎన్నెన్నో ఆశలు చూపించినిన్ను ఆకర్షిస్తారు ,
డబ్బు ఆశచూపించి బుట్టలో పడేస్తారు చక్కగా 
ఆశపడి అందులో జొరబడితివా నీ ఇల్లు గుల్ల 
వినుము కెఎల్వీమాట నిజ ము సుమ్ము .. !!

మాటల్లోపెట్టి నీ భోగట్టా లాగుతారు తెలివిగా 
బ్యాంకు నంబర్ల ప్రస్తావనతెచ్చిబోల్తాకొట్టిస్తారు !
వివరాల జాబితావిప్పితివావారిమాయలోపడ్డట్టే 
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!

లాటరీలు అంటారు బహుమతులు అంటారు 
పేదవారికి పనికొచ్చే ధనసహాయం అంటారు ,
తాయిలాల రొచ్చులో తలబెట్టబోకు సోదరా .. 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!

తియ్యతియ్యని మాటలతో చాటింగులు మొదలై 
నగ్న చిత్రాలు సైతం చూపించినట్టేటముంచుతారు 
ముగ్గులోకిదింపుతారుమోసంచేసిమాయమౌతారు 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

మత్తులోపడినువ్వుఆ . మాయలోచిక్కుకుంటివా 
బాంకు వివరాల భోగట్టా పూసగుచ్చినట్లుచెబిటివా 
సైబర్ నేరగాళ్ళ గుప్పిటలో చిక్కుకున్నావనర్ధము !
వినుము కేఎల్వీమాట నిజము సుమ్ము .. !!
కామెంట్‌లు