జీవనరాగం ...!! > (ఆన్షీలు)డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మకొండ (9866252002)


 ప్రజలని పరిపాలించడానికి 
పార్టీలు పుట్టుకొస్తాయి ఎన్నెన్నో ,
ప్రజాసేవపేరుతో మొదలు దోపిడీల లొల్లి !
వినుము కెఎల్వీమాట నిజముసుమ్ము !!

కుక్కగొడుగుల్లా లెక్కలేనన్ని పార్టీలు ,
పార్టీపదవులనడ్డు పెట్టుకుని ప్రజలను
జలగల్లాపీలుస్తారు రక్తం,గమనించుమా !
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము !!

ప్రజాస్వామ్యం పేరుతో ప్రతివాడు 
పార్టీనొకదానిని మొదలుపెడతాడు ,
తాయిలంఅందగానే కండువా మారుస్తాడు !
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము!!

రెండుపార్టీల ఎన్నికల వ్యవస్థ మొదలై ..
ప్రజలలో తికమకను తరిమి..తరిమి కొట్టి ,
నమ్మకమైన నాయకులను ఎన్నుకొనుట మేలు 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

అప్పులుచేసి పరిపాలించేవాడు నాయకుడా ?
దారిద్ర్యాన్ని కట్టబెట్టేవాడు ప్రజలమనిషా .....
నిజముతెలుసుకుని మసలుకో మానవా ....
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

ఒకపార్టీ పేరుచెప్పి గెలుపొందినవాడు 
స్వార్దానికి బానిసగా మారిపోరాదు ...
కండువాలు పదేపదే మార్చి మోసముచేయుటేలా ?
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

కామెంట్‌లు