జీవనరాగం ..!! >(ఆన్షీలు)డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ (9866252002)
వెడల్పు రోడ్లు వేస్తారు అభివృద్దికి ఆనవాలుగా ,
ఎత్తయిన ఫుట్పాత్లు పాదచారులకోసం అన్నట్టు !
రాజకీయ రోగంతో ఫుట్పాత్ లే మినీ దుకాణాలు 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

పాదచారులకు బాటలేక నడిరొడ్డున నడిచెదరు 
ద్విచక్రవాహనాలు వాయువేగాన గుద్ది పారిపోవు 
ఫుట్పాత్ లేకపాదచారులవ్యథలువినువారెవ్వరు 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ....!!

రకరకాల పండ్లబళ్ళు కూరగాయబళ్లు జ్యూస్ బళ్లు 
పాదచారుల రహదారిని ఆక్రమంచు కొందురు వాళ్లు 
చెత్తాచెదారంతో పరిసరాలు పాడుచేయుదురు కదా 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ...!!

అరటితొక్కలమీద తెలియక కాలువేసి జారిపడి 
ఎముకలు విరగ్గొట్టుకున్నవాళ్ళు కొకొల్లలు ....
అయినా పట్టించుకొను నాధులే కరువాయే లే !
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ...!!

నాయకుల స్వార్థము విషభీజమై విస్తరించి ...
మామూళ్ల దందాలో అధికారాగణముండగా 
సామాన్యుల జీవితాలు అపహాస్యమైపోయే గ 
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ....!!

ప్రజల హక్కులు ప్రజలే సాధించుకోవలె లే 
ఎవరోవచ్చి ఏదో చేస్తారనుకోవడం తప్పులే 
మనసుపెట్టిపోరాడిన పొందనిది ఏమున్నది ?
వినుము కెఎల్వీమాట నిజము సుమ్ము ....!!


కామెంట్‌లు