మన దేశం:భ ర త వ ర్షం "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌మహారాజు భరతుడు
     పాలించిన దేశము
     "భరత వర్ష" మనగా
                   ఓ తెలుగు బాల!
👌మన దేశమునకు.. "భరత వర్షము", మరియు, "భరత ఖండము".. అని, పేరు!
👌 భరత వర్ష ము నకు.... ఉత్తరమున.. హిమాలయ పర్వత శ్రేణులు; దక్షిణమున.. హిందూ మహా సముద్రము ( సేతు బంధము ) కలిగిన భూ భాగము!
👌ఆ సేతు... హిమాచల పర్యంత మైన, ఈ సువిశాల మైన "భారత దేశం" మనది. దీనికి.. "వేద భూమి", "రత్న భూమి", "భరత భూమి"... అని, పలు పేరులు కలవు.
          🙏 సీస పద్యము:
          వేద ముఖుల తోడ, వేద ఘోషల తోడ
విలసిల్లి నట్టిదీ "వేద భూమి"!
              రత్నాల రాశులన్, రమణీయ శోభతో
 ప్రసవించి నట్టిదీ "రత్న భూమి"!
               మిస మిస లాడిన, పసిడి పంటల తోడ
భాసురం బైనదీ "భరత భూమి"!
           (.. భరత మాత నుతి., డా. మీగడ రామలింగ స్వామి. )
కామెంట్‌లు