మన దేశము:-జా తీ య ప తా క ము "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌మూడు వన్నెల ధ్వజము
     చైతన్య కేతనము
      మన జాతి పతాకము!
                  ఓ తెలుగు బాల!
👌జాతీయ పతాకము... మన భారత జాతి సమైక్యతకు సంకేత మైనది. ఆ బాల వృద్ధు లందరికి.. స్వేచ్ఛా స్వాతంత్ర్యము లను కలిగించి నది.
👌 జెండా.. కదలు నది. కనుక, "పతాకము", మరియు, "ధ్వజము" అని పేరు. వీరు.. వారని వివేక జ్ఞానము నొసగు నది. కనుక, "కేతనము" అని పేరు. విజయము నకు సంబంధించి నది. కనుక, "వైజయంతి" అని పేరు. జెండాకు... "టెక్కము, సిడము, పడగ, డాలు.." అను నవి; అచ్చ తెలుగు పదాలు!
👌పంచ "జ"కారము లు.. శ్రేష్టము లైనవి. అవి...
          "జనని" అనగా.. తల్లి (1); 
"జన్మ భూమి" అనగా.. మాతృ దేశము (2);
 "జనకుడు" అనగా.. తండ్రి (3); 
జాతీయ కేతనము అనగా.. మన భారతదేశం యొక్క జెండా (4); 
జాహ్నవీ తటము అనగా.. గంగా తీరము (5) అనునవి; పవిత్రము లైనవి.
          🙏 ఆట వెలది పద్యము
             జనని, జన్మ భూమి, జనకుండు, జాతీయ
            కేతనంబు, జాహ్నవీ తటంబు;
          పరమ పావనములు పంచ "జ"కారముల్!
          లలిత సుగుణ జాల! తెలుగు బాల!!   
           ( తెలుగు బాల శతకం., "డా. కరుణ శ్రీ., )
కామెంట్‌లు