భరత ఖండము::మన భారత దేశము:- "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి: 99127 67098
 👌పరమ పవిత్ర మైనది
     శక్తి వంత మైనది
      మన భారత దేశము
                ఓ తెలుగు బాల!
👌మన భారతీయు లందరు.. జ్ఞాన విజ్ఞాన వంతులు! సర్వ శక్తి సంపన్నులు! మహా పురుషు లైన... రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, త్రి మతాచార్యులు.. అవతరించిరీ... మన "భారత దేశము" నందు!
👌"భా" అనగా కాంతి ( వెలుగు )! ప్రకాశించు నది! "రత" అనగా రమించు వారు, లేదా క్రీడించు వారు. జ్ఞాన ప్రకాశము నందు రమించు వారు. కనుక, భారతీయులు నివాస మున్న ఖండమే.... మన "భారత దేశము!"
          👌 చంపక మాల పద్యము
          పరమ పవిత్ర మోయి మన భారత దేశము, వేద శాస్త్రము ల్
          పరగెడు దేశ మోయి, కవి వర్యులు, శిల్పులు, గాయకుల్, నటుల్
           వరలెడు దేశ మోయి, భగవానుడు బుద్ధుని వాక్సుధా జ్జరుల్
            తొరగిన దేశ మోయి, విమలంబగు సత్యము, శాంత్యహింసలున్
            తిరమగు దేశ మోయి,మన భారత దేశము! లోక బాంధవా!
      ( డా. జొన్నలగడ్డ మృత్యుంజయ రావు.)


కామెంట్‌లు