నారాయణి! నమోస్తు తే! "వాక్కు రూ పి ణీ" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098
 👌 మేథా శక్తి వీవే!
       వాక్కు రూపిణి వీవె!
       వీణా పాణి! వాణి!
           నారాయణి! శివాని!
 ( "నారాయణి" పదాలు., )      
👌 పరం బ్రహ్మ రూపిణీ,
నారాయణి.. మేథా శక్తి స్వరూపిణి! మేధస్సు అనగా.. జ్ఞాన, విజ్ఞానము లను.. తనబుద్ధి యందు నిలుపు కొను శక్తి సామర్థ్యములు కలిగి యుండుట! వాక్కు రూపిణీ.. సరస్వతీ దేవి!
👌నారాయణి.. సాత్వికము, రాజసికము, తామసికము.. అనెడు మూడు గుణముల రూపములతో; నీతి నియమములతో విలసిల్లు చున్నది. ఆరాధకు లందరిని కరుణా కటాక్ష వీక్షణములతో అనుగ్రహించు చున్నది.. నారాయణి!
👌ఆది పరాశక్తి యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
       మేదే సరస్వతి వరే 
       భూతి బాభ్రవి తామసి!
       నియతే త్వం ప్రసీదేశే
       నారాయణి! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్త శతి" ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )


కామెంట్‌లు