శివ పదము - శ్రీ కారము "శంకర ప్రియ" శీల.,సంచార వాణి: 99127 67098

 👌"శ్రీ" కారమే "శివము"!
     శ్రేయస్కరము శివము!
      ని:శ్రేయస్సు శివము!
           శంకర ప్రియు లార!
👌శ్రీ "శి వ" పద మనగా మంగళ శ్రీ! శ్రీ కారము! "శ్రీ" యనగా శివము! శుభము! విజయము!మంగళము! "శ్రీ" కారము, "శివ" పదములు.. రెండూ వేర్వేరు కావు, ఒక్కటే! మంగళ వాచకములు! గౌరవ శబ్దములు!
👌సచ్చిదానంద పరం బ్రహ్మమే- "శివము"! ఇచ్ఛాశక్తి- జ్ఞాన శక్తి - క్రియా శక్తి స్వరూపమే .. "శ్రీ కారము"! నిర్గుణ నిరాకార శివ పరం బ్రహ్మము నుండి సంకల్ప మాత్ర మున పరా శక్తి ఆవిర్భవించింది!
👌శ్రీ శివ శక్తుల నుండి.. బిందు నాదములు; వాటి నుండి .. ఈ చరాచర ప్రపంచ సృష్టి కార్యము జరిగింది. ఆ విధముగా స్త్రీ పురుషులు, పంచ మహా భూతములు.... మున్నగు వాటితో ఈ విశ్వరూపము ఏర్పడినది!
 👌శ్రీ ఉమా మహేశ్వరులే... ఈ వసుధైక కుటుంబము నకు ఆది దంపతులు! కనుక "విశ్వ కుటుంబిని" యైనారు. సకల మాన వాళికి - శ్రేయస్సులను మరియు ని:శ్రేయస్సును అనుగ్రహించు చున్నారు, సాంబ శివ పరం బ్రహ్మ మూర్తి!
          🙏 కంద పద్యము:
         శ్రీ కర మంత్రము శివమే!
         శ్రీ కారము, శుభ ప్రదంబు, శ్రీమంతంబున్!
        శంకర కింకరుల కెపుడు 
         శ్రీ కైవల్య ప్రదాత శివుడే! సుమతీ!
             (చాటు పద్య రత్నావళి)
కామెంట్‌లు