తారక మహా మంత్రము: "ఓం" కారమే సృష్టి మూలము "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌"ఓం" కారమె విశ్వము
      త్రి కాలముల రూపము
       కాలముల కతీతము
                  ఓ తెలుగు బాల!
 👌 "ఓం" కారమే... తారక మహా మంత్రము! ఈ చరాచర ప్రపంచ సృష్టికి మూలము!
👌భూత.. భవిష్యత్ .. వర్తమాన మనెడు, మూడు కాలము లన్నియు "ఓం" కారమే! ఈ కాల త్రయము నకు అతీత మైనది కూడా "ఓం" కారమే!
👌"ఓం" ఇత్యేత దక్షర మిదం సర్వం!" అని; మాండూ క్యోపనిషత్తు ... "తారక మహా మంత్రము" యొక్క తత్వ జ్ఞానమును విశదీకరించు చున్నది!
          🙏 తేట గీతి పద్యము:
        అన్నిటికి మూల "మోం"కార మక్షరంబు
        వర్తమాన గతాగత ప్రథిత కాల
         మెల్ల, "ఓం" కారమే యగు; ఈ త్రి కాల
          ముల కతీత "మోo" కారమే! కాల కాల!!
           (... భక్తి గీతాలు., "ఆర్షకవి శిరోమణి" విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు., )
కామెంట్‌లు