తారక మహా మంత్రము: "శి వ" ప ద ము"శంకర ప్రియ" శీల.సంచార వాణి: 99127 68098

 👌భవ సాగరము నుండి
     తరియింప చేయు నది
     "శి వ" పదము యొక్కటే!
             శంకర ప్రియు లార!
👌సాంబ శివుడే.. తారక పరం బ్రహ్మము! సచ్చిదానంద స్వరూపు డయిన పరమేశ్వరుడు! జనన, మరణ, ప్రవాహ రూప మైన.. ఈ సంసార మనెడు సాగరము నుండి సకల జీవరాశిని దాటించు చున్నాడు! శ్రీ కైవల్య పదమును అనుగ్రహించు చున్నాడు, కనుక, "తా ర క" నామ ధేయుడు.. సాంబ శివుడే!
 👌"తారకః పరమేశ్వరః" అని, మహా దేవుడగు శివుని ప్రస్తుతించాడు, "శివ భాగవతుడగు నారాయణుడు",
 "శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రము" నందు! ఆ స్తోత్రము నందు.. సాంబ శివుని యొక్క మహిమాన్విత మైన నామములలో "శ్రీ శివ తత్త్వ రహస్యమును విశదీకరించారు. శ్రీ స్వామి వారికి త్రికరణముల శుద్దిగా సేవలు చేసారు, శ్రీ నివాసుడైన, శ్రీ మహా విష్ణు మూర్తి.
         🙏కంద పద్యము
         "శి వ" యను రెండక్షరములు
         భవ "తారక మంత్ర" మగుచు, భద్రత గూర్చున్!
         "శి వ"యను అక్షర యుగ్మమె
         భువి జనులకు నయ్యె, "కల్ప భూజమ్ము" శివా!
          ( -శ్రీ శివ శతకం., డా. "శ్రీపాదుక" కొల్లూరు అవతార శర్మ,)
కామెంట్‌లు