*సూక్తిసుధ -(పేరడిపద్యాలు)*:---: *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*
 
*కం*
ఎప్పుడు ఎన్నికలొచ్చిన
అప్పుడెనాయకులువస్తురదియెట్లనగన్ 
అప్పులు మాఫీయనగనె
కుప్పలుగానప్పుదార్లుగూడినవిధమున్
ఆ.వె
కప్పు కాఫి చాయ-కలసిఒక్కటిగాని
 చూడచూడరుచుల-జాడ వేరు 
రాజులందురంకు-రాజులువేరయా 
చేరికొలవబోకు- చేటుకలుగు
ఆ.వె
చక్కనైనభార్య-చుక్కవిధమునుండ

 వేశ్యలెందుకోయి-వెర్రివాడ  
గుప్తజాడ్యమొచ్చి-గుటుక్కుమంటావు 
ఇల్లు జక్కబెట్టు-నింతిచాలు
కామెంట్‌లు