*బాలగేయం(ఎందుకురా!):-: *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

శిశువుజననమెందుకురా!
మనిషిగమసలేటందుకురా!!

మనిషిగమసలుటెందుకురా!
మమతనుపంచెటందుకురా!!

బడిలోగురువులెందుకురా!
చదువులునేర్పేటందుకురా!!

చదువులునేర్చుటెందుకురా!
జ్ఞానంపొందేటందుకురా!!

గుడిలోదేవుడెందుకురా!
పూజలుజేసేటందుకురా

పూజలుచేసేదెందుకురా!
ముక్తినిపొందెటందుకురా!!

కలముకాగితమెందుకురా!
కవితలురాసెటందుకురా!!

మందులువైద్యులెందుకురా!
జబ్బులుమాన్పెటందుకురా!!

పోలిసుభటులెందుకురా!
రక్షణచేసేటందుకురా!!

కామెంట్‌లు