*వానాకాలం* *(బాలగేయం)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

వానకాలం వచ్చింది 
వరదలు బాగతెచ్చింది 
వాగులు వంకలు నింపింది 
నేలనుపచ్చగచేసింది

 ధనధనమని ధర్వులతో
మిలమిలమనిమెరుపులతో
గలగలమని గర్జనలతో
జలజలవాన చినుకులతో 

ఆడుతుపాడుతుగంతులువేయుచు
చెరువులునిండుగనింపింది
కరువులు లేకుండ చేసింది
హాయిని కలగజేసింది 

పాడిపంటలు పండించి 
రైతుల బాధలు తొలగించి 
ప్రగతినిమెండుగకలిగించి
 జగతినిముందుకునడిపింది.

కామెంట్‌లు