పద్యాలు:-అన్నల్ దాస్ రాములు సిద్దిపేట9949553655

 సీసము

గతకాలమేమంచి ఘనకీర్తి యనుకుంటె
    చెరబట్టి నట్టుల చరితయేల ?
కృతయుగ మందున కృపయంత యనుకుంటె
    హీరణ్యకశిపుని హింసయేల ? ~
రాముని కాలము రంజిల్లె ననుకుంటె
    రావణ మదియందు రంకుయేల ?
ద్వాపర మందున దండి నీతనుకుంటె
    వలువలు విప్పిన వంశమేల ?
తేః గీః
మంచి చెడ్డలు కవలలు మహిననోయి
జగతి యందున దొర దొంగ జంటలోయి
అన్ని కాలాల యందున యున్నరోయి
గతము తలపోయ మనసంత వెతనెనోయి
       


కామెంట్‌లు