పద్యాలు:-అన్నల్ దాస్ రాములు సిద్దిపేట9949553655
కందము

కందమున కవితలల్లిన
అందముగానుండు పద్య నల్లికలన్నిన్
కందము రాసెద నింపుగ
కందము పాడెదను మధుర కంఠము తోడన్

తాగిన మైకము గమ్మును
తాగిన నీమాటలన్ని తత్తర పాటున్
తాగిన వాగుడు యెక్కువ
తాగిన వాగ్దాటి యంత తగ్గును నిజమున్

మాటలు నేర్చిన వాడును
కోటలు నిర్మించగలడు కోతలు కోసిన్
మాటల మూటల తోడను
పాటలు రాసిండు కవియు పల్లవి తోడన్

  


కామెంట్‌లు