రక్షా బంధము:-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్9963991125
ఈ బంధ ముడిలోన ఇబ్బందులుంటాయ?
ఫుల్లాబ్జ పరిమళపు పుప్పొడుల వీచులే

ఈ బంధ ముడిలోన ఈశ్వరేచ్ఛయే గాక
సోదరీసోదరుల సుఖ కాంక్షయే గలదు

ఈ బంధ ముడిలోన ఇహ జన్మయే కాదు
ఏడేడు జన్మాల ఎలమి బంధము కలదు

ఈ బంధ ముడిలోన ఇడుములను కడదేర్చు
బలమైన బాధ్యత్వ మాహత్మ్యమే కలదు

ఈ బంధ ముడిలోన ఇరువైపులను నిలిచి
ఆపదల తొలగించు అభయ హస్తము కలదు

ఈ బంధ ముడిలోన ఈశ్వరుడె యన్నయ్య
ఈప్సితములీడేర్చు  ఇలలోని కన్నయ్య

ఈ బంధ ముడిలోన ఇభరాజ బలముంది
ఇరవైన ఫలముంది ఇగకొండ ఎత్తుంది

ఈ బంధ ముడిలోన ఎనలేని భావములు
ఈ బంధ ముడిలోన ఇక్షురస మూలికలు


కామెంట్‌లు