జగన్మాత రక్షించు(పద్యం)జెగ్గారి నిర్మల-తెలుగు భాషోపాధ్యాయురాలుజిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక

 ఉత్పల మాల
కావుము మాత మమ్ములను కార్యము జేయను శక్తి నిచ్చినీ
దీవెనలివ్వుమా జనని ధీరత గల్గను భారతమ్మ యీ
కోవిడు  ద్రుంచిలోకులకు గోడును లేకను జేయుమమ్మ నీ
సేవలు జేసెదన్ యెపుడు క్షేమము తోడును  రక్షజేయుమా
కం:
తనువున కోవిడు జేరియు
మనిషిని మాయమును జేసె మహిలోనేడున్
కొనచూపులు లేకుండను
దినదిన గండమున జనులు దిగులే జెందన్
కామెంట్‌లు