*వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(పదవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 37)
ఆగు ఆగు మానవా
చేసే పనిని మానవా
చెట్లు నరికితే తెలుసునా
బ్రతుకు నరకమే కలుగునా!
38)
చెట్టు పెంచినవాడు శ్రేయోభిలాషిర
చెట్టు నరుకువాడు చెనటియేర
చెట్టు రక్షింపరా శీఘ్రము
అదిలేని వాతావరణం రౌద్రము
39)
వనవిషాద దీనాలాపన దిగంతము
వ్యాపించి వినిపించె సాంతము
అదివినిన ప్రభుత్వము అభయమిచ్చె
వనరక్షణకై యంత్రాంగానికి తాఖీదునిచ్చె!
40)
ఇక మొదలాయెను కార్యక్రమము
కార్యరూపము దాల్చె క్రమక్రమము
చెట్లునాటి చెట్లుపెంచె ఈతరము
అదెఅయినది పుడమికి హరితహారము!
(సమాప్తము)


కామెంట్‌లు