ధూమపానం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 పొగాకు తాగకు సోదరా!
చిరాకు పుట్టదా వాసనా?
పరాకు ఏలరా యువకా?
చీకాకు కల్గించక దూరం పోరా!
పలుకులన్నియు చెవిటివానిముందు శంఖమూదడమా?
ఉలుకు లెందుకు ఆపరా?
చిలుకు నీ శ్వాస అగ్నిహోత్రం
లేపకు కాలుష్యం చుట్టూరా!
మానకుంటే అలవాటు 
పోతావు గ్యారంటీగా
మారకుంటే అవుతావు 
అస్థిపంజరంగా
మారాకు ‌తొడిగిన కొమ్మను చూడు
మాపకు పీల్చుట మరణం వరకు
తాపకు మరొకరికి సిగరెట్టు
రేపకు బాధలు కుటుంబానికి‌ రెట్టింపు
ఆపకుంటే మిగిలిపోతావు 
గోడమీద బొమ్మలా!
చూపకుంటే విచక్షణ 
క్యాన్సరే తోడు నీకు గదరా!
కామెంట్‌లు