కృష్ణా నువ్వే మాకు రక్ష- యామిజాల జగదీశ్
కృష్ణా
బాలకృష్ణా
శ్రీ కృష్ణా
నువ్వే మాకు రక్ష రక్ష!!

ఈ విశ్వాన్ని కంటికి రెప్పలా
చూసుకోవడానికి 
రావాలి 
నువ్వే రావాలి!!

ద్వాపర యుగాన్ని రక్షించేందుకు
అవతరించి
నీ మహత్తులతో జగమేలిన కృష్ణా
ఇప్పుడూ నువ్వే రావాలి

నీ వేణుగానంతో
పక్షులను 
గోపికలనూ అలరించావు

ఆకులను రాల్చిన చెట్లు
నిగనిగలాడేవి నీ వేణుగానంతో 
శృతి కలిపిన కోకిల స్వరంతో

దుష్ట శిక్షణ
శిష్ట రక్షణగా 
నీ లీలలన్నీ ఇన్నీ కావు
పాండవులను తోడుండి
కౌరవులను ఓడించిన కృష్ణా
నీ రాకే ఈ జగానికి పండగ!!

ప్రపంచానికి 
సన్మార్గంలో నడవటం కోసం
నీ గీతోపదేశం ఓ మంత్రమే!!

స్నేహానికి ప్రాణమిచ్చావు
ధర్మాన్ని శాసించావు
యుగాలను పాలించే కృష్ణా
నువ్వే మాకు రక్ష

ఓం నమో వాసుదేవాయ నమః
ఓం నమో నారారణా

అందరికీ 
కృష్ణాష్టమి శుభాకాంక్షలు


కామెంట్‌లు