పచ్చనితల్లి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 సుందరమైనది,ఆహ్లాదపరుచునది.
సంతోషాన్నిచ్చి,సేదదీర్చునది.
ఎన్నో వింతలతో,ప్రాణికోటికి 
నిలయమైనది.
మానవాళికి ఇవ్వడమే తప్ప
తీసుకోవడం తెలియని మహాదాత.
ప్రేమించి కాపాడాలి,కాలుష్యం చేయొద్దు.
ధ్వంసం చేస్తే,వికృతవుతుంది.
రక్షిస్తే,సేవిస్తే,అమృతమై బతుకునిస్తుంది.
నాశనంచేస్తే కన్నెర్ర చేసి,
విలయతాండవం చేస్తుంది.
సంరక్షిస్తే పచ్చనితల్లై కళకళలాడుతూ
ప్రాణవాయువులనిచ్చి,
ఆయుష్షు పెంచుతుంది.

కామెంట్‌లు