చింత పండు - బాల గేయం (మణిపూసలు):--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 చింత పండు చిన్నగుండు 
చప్పరిస్తె పుల్లగుండు 
  వంటకాల లోనమజా 
పులిహోరకు కమ్మగుండు !

ఆకులెంత చిన్నవోయి 
గింజకూడా బుజ్జి దోయి 
చెట్టు చూడు విస్తరణగ
ఊరికి ఉపయోగమోయి !

చింతచిగురు పప్పు,నెయ్యి 
పచ్చడితో కలపనియ్యి 
ముదురు ఆకులెండబెట్టి 
చింతఆకు పొడిని చెయ్యి!

వానకాల మాధరువుగ
ఎండల్లో ఉపాధిగా 
చింత చెట్టు చింత దీర్చు 
చింతకాయల పచ్చడిగ!

కామెంట్‌లు