*నవ్వులు-రకాలు*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 32.తుమ్ములొచ్చే నవ్వులు!
      కమ్ముకొచ్చే నవ్వులు!
     మోసుకొచ్చే నవ్వులు!
     మోసపుచ్చే నవ్వులు!
33."సెల్ఫీ" నవ్వులు!
      "హేపీ" పువ్వులు!
      "ఫ్లాపి" నిల్వలు!
      "స్లీపి". సొగసులు!
34. కార్టూన్ వ్యంగ్య చిత్రాలు!
       నవ్వులకు రసపాకాలు!
       పరోక్షంగా ఊదే బాకాలు!
  ప్రత్యక్షంగా ఎగిరే బావుటాలు!
35. హాస్యోక్తులు(జోక్స్),
     పంచుతాయి నవ్వుల కేక్స్!
     నిశ్శబ్దాల నిర్మూలన క్రేకర్స్!
     ఆనందసామ్రాజ్య ఓనర్స్!
36.చప్పట్లు నిజంగా,
      నవ్వుల ఫ్రెండ్స్!
      ఆనందానికి డివిడెండ్స్!
      హర్షానికి ఎవిడెన్స్!
37.శైశవాన నవ్వు అమాయకం,
 వయసు పెరిగే కొద్దీ మాయకం,
  స్వచ్ఛత క్రమేపీ మాయం,
  కృత్రిమం కావడం ఖాయం!
         (కొనసాగింపు)

కామెంట్‌లు