*చెరగని గుర్తు*: -శ్రీ....

 రామాపురం లో  రాజు, రాము  అనే స్నేహితులు ఉన్నారు.       ఇద్దరు స్నేహితులు సెలవురోజు ఊరు వెలుపలకి షికారుకెళ్లారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు .  రెండో వాడిపై కాదు     తలపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు. అక్కడున్న ఇసుకపై 'ఈ రోజు నా స్నేహితుడు. నా తలపై కొట్టాడు' అని రాశాడు. మళ్లీ ఇద్దరూ ముందుకు నడిచారు.
మరికొంత దూరం వెళ్లాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు. తలపైదెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు. బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై 'ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు' అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా, 'ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగి పోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు. కనుక అలారాశాను. అదే సహాయం చేసినపుడు శాశ్వతంగా
గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను' అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మరచిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి..
..
కామెంట్‌లు