నువ్వు - కవి కణ్ణదాసన్

 నువ్వు నాటిన విత్తనాలను
నువ్వే సాగు చేసి 
కోతలు కోసాకే
ఆ భూమిలో ఇతర పైర్లను
నాటగలం, పండించగలం
ఖూనీలూ
చోరీలూ
కుట్రలూ
అన్నీనూ చేసేసి
దేవుడా అని అరిస్తే
దేవుడు
నువ్వెళ్ళే గుళ్ళోనూ
కనిపించడు
భగవంతుడి త్రాసు 
వర్తకుడి త్రాసు కాదు!!


కామెంట్‌లు