*అపాయంలో ఆలోచన*:-శ్రీ...


 మధుర అనే    నగరం లో  రాముడు అనే పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు రాముడు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి ధనం

 ఇస్తాడనీ దాన్ని తీసుకురావాలనీ చెప్పాడు. దాంతో రాముడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క 'స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆయన. రాముడికి     ధనం  పెట్టెను  చేతికి ఇస్తూ... 'దార్లో దొంగలు ఉంటారు. ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లు' అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో   రాముడు డు డు డు తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి. రాముడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంతదూరం వెళ్లేసరికి రాముడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి, నది ఒడ్డున నిలబడి... 'నా పెట్టె నీళ్లలో పడిపోయింది..' అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. రాముడి  వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న ... పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

      రాముడు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తండ్రికి వివరించాడు. తండ్రి కుమారుడి తెలివి తేటలను అభినందించాడు.

.

కామెంట్‌లు