స్వప్న వీధిన సగటు మనిషి :-జెగ్గారి నిర్మల-సిద్దిపేట

 కలల ప్రపంచంలో కదలి పోవాలని
ఊహాలోకంలో ఊగిసలాడ లని
ఆశనిరాశల అలజడిలో ఆత్మవిశ్వాసంతో అడిగే స్తూ 
నిరంతరం జీవన పోరాటంలో
అహర్నిశలు అలుపెరగకుండా
అర్ధాకలితో నైనా ఆనందంగా నుండె
సగటు బ్రతుకులకు  స్వప్నాలు ఎన్నో
రంగులరాట్నంలా జీవితం
రంజిల్లాలని
గగన విహారంలో కదలి పోవాలని
అద్దాల మేడలో అలరించాలని
అద్భుత సుందర శిఖరాలను అధిరోహించాలని
కోరికల కోలాహలం లో కొట్టుమిట్టాడు ను
బంధాల బరువు బాధ్యతలతో
ఆటుపోటులలా ఆగకుండా 
దూరపు కొండలు నునుపు అన్నట్లు
ఎండమావి లాంటి జీవితానికి
ఆశలు అలలా తొలగిపోయిన
సగటు మనిషి జీవితం
ఆ భాగ్యడిగా మిగిలిపోవు
కామెంట్‌లు