రచయిత్రి ధనాశి ఉషారాణికి *అబ్దుల్ కలాం యూత్ ఎక్సలెన్స్ అవార్డ్*

 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలుగాను
ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సాహితీ పక్రియలను రూపొందిస్తూ తోటి కళాకారులకు అనేక అవార్డులును ఇవ్వడముతో పాటు కవి సమ్మేళనంలు నిర్వహిస్తూ
అనేక నూతన ప్రక్రియల్లో శతకాలు రాస్తున్నారు.సున్నితము  నూతన ప్రక్రియలో  కవితలు రాసి ప్రతిభ చాటినందుకుగాను *అబ్దుల్ కలామ్ యూత్ ఏక్సలెన్స్  అవార్డ్* ను సాహితీ బృందావన వేదిక ద్వారా అందుకున్నారు.శ్రీ ఏనుగుల నరసింహ రెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు మరియు సునీత గారు తెలియజేసారు.
ఇప్పటికే అనేక పుస్తకాలు సాహిత్యంలో అచ్చువేసి అనేక అవార్డులుపొందారు.ఉషోదయ సాహితీ వేదిక కార్యనిర్వాహక సభ్యులు అభినందనలు తెలియజేసారు.
కామెంట్‌లు