బెల్లం, చక్కెర ఉన్నంత సేపు ఎందుకు ఈగలు, చీమలు !?:-*ప్రతాప్ కౌటిల్య విశ్రాంత అసిస్టెంట్ ప్రొఫెసర్ ( బయో టెక్నాలజి )*

 *బెల్లం ఉన్నంత సేపు ఈగలు, చక్కెర ఉన్న చోటికి చీమలు చేరతాయని అంటాం. అసలు వాటికే ఎందుకు ఈగలు, చీమలు ఎగబడతాయో గ్రహిద్ధాం.*
ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన ఈ జీవులు నిరంతరం ఆహార సేకరణ కోసం సంచరిస్తూనే ఉంటాయి. ఇందుకు ఎంత ఎక్కువ శక్తి కావాలో దానిని అవి ఖర్చు చేస్తూనే ఉంటాయి. నిరంతరం  lపరిభ్రమిస్తూ క్రియల రేటును పెంచుకుంటూనే ఉంటాయి. అందువల్ల ఇన్స్టంట్ ఫుడ్ లోని గ్లూకోజ్ ను, వెంటనే ఆహారంగా స్వీకతీస్తుంది. తద్వారా వెంటనే  శక్తిని నేరుగా పొంది, జీవన క్రియలను జరుపుకొంటాయి. అందుకే అవి ఈ ఇన్స్టంట్ ఫుడ్డు నే ఎక్కువగా ఇష్టపడతాయి. జన్యు పరంగా అవి, వీటి ప్రాథమిక ఆహార లక్షణంగా అనువంశికంగా కొనసాగుతుంది. అందువల్లనే చక్కెర బెల్లం లో నేరుగా వీటికి గ్లూకోజు అంది వాటి జీవన క్రియలను వేగవంతంగా జరుపుకుంటాయి. వీటికి నిరంతరం ఆకలి గానే ఉంటుంది. ఎందుకంటే ఇవి నిరంతరం పని చేస్తూనే, ఆహారం కోసం నిరంతరం అన్వేశిస్తాయి. అందువలన వీటి దృష్టి అంతా, చక్కెర బెల్లం వంటి వాటిమీదే ఉంటుందని సైన్స్ వివరణ. తక్షణమే శక్తిని అవి తయారు చేసుకోక తప్పదు. అందువల్ల గ్లూకోజ్ ను నేరుగా అందించే చెక్కెర, బెల్లం ఆహారాలనే ఎక్కువగా అవి ఇష్టపడతాయి. అందుకే ఇవి క్రమ క్రమంగా అనువంశిక లక్షణంగా మారి ఉండవచ్చు.
కీటకాలు సైతం పుష్పాల్లోని నెక్టారునూ పీల్చుకొని ఇన్స్ టెంట్, గ్లూకోజ్ ను నేరుగా పొందుతాయి. తన జీవన క్రియలను జరుపుకుంటాయి. తుమ్మెదలు తదితర కీటకాలు పూల వల్ల నేరుగా గ్లూకోజ్ ను పొంది, దాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ కీటకాలు నిరంతరం ఆహారం కోసం పని చేస్తూనే, సంచరిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో శక్తి ఎక్కువగా ఖర్చు చేస్థాయి. అందువల్ల ఎక్కువ శక్తిని వెంటనే పొందడానికి పూలలోని పుప్పొడిని, నెక్టారునూ ఆహారంగా స్వీకరిస్థాయి. అందులోని గ్లూకోజ్ ను నేరుగా పొంది, వెంటనే శక్తిని పొందుతాయి.
 వీటికి ఇన్స్ టెంట్ ఫుడ్ కావాల్సిందే. 

కామెంట్‌లు