విశ్వాసాలు(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 శుభ్రతకు,స్వచ్ఛతకు ఆనవాళ్ళు
కులాలకు,మతాలకు సంబంధించిన
బలమైన ‌విశ్వాసాలు
సంస్కృతి,సంప్రదాయాల్లో అంతర్భాగాలు
అనాదిగా వస్తున్న పెద్దల కట్టుబాట్లు
శాస్త్రీయమైన, నిగూఢ విజ్ఞానదాయకాలైన నిబంధనలు
అందరి మంచి కోసం ఏర్పరిచిన సూత్రాలు
మానసిక,భౌతిక ఆనందాలకు
ఋజువులు
ఆచారాలు అర్థవంతమై‌,విచక్షణాయుతమై
ఉండాలి
కాలానుగుణంగా మారుతూ
నవీనమవ్వాలి.
కామెంట్‌లు