సమదర్శిని !!:-:-కె ఎస్ అనంతాచార్య
ఒక్క పాంచజన్యం కదలిక ప్రపంచాన్ని  ఊర్రుత లూగించింది 
దేశ భాష సంస్క్రతుల మీద భగవానుడి
 నుడువులు  తిప్పిన సుడులలో 
అందరూ మునిగి మునకలేస్తున్నారు
అన్యధా శరణం నాస్తి యని ఆతృతగా సాగిలపడుతున్నారు

ఆయన గీసిన గీత జాతికి లక్ష్మణ రేఖ  
నుదిటి రేఖల అపశ్రుతుల
సరిదిద్దే  చక్రవాక 
 
దెబ్బతిన్న కణాలకు  సనాతన ఆరోగ్య గుళిక
నిరాశ నిట్టూర్పుల మీద ఆశవహాయై 
 తూర్పున ఉదయించిన వెలుగు రేఖ

ఇది పాఠ్యగ్రంధం 
పఠన మకరందం 
అర్జునికి అన్యాపదేశం అందరికి 
మొహావేశాలను తొలగించే కర్మ ఫలసందేశం
 
ఇది ఒక సమాజపు ప్రతీక కానే కాదు 
ఒక రహస్య పేటిక
గుట్టు విప్పితే  ఔషధ మాలిక 
జ్ఞాన వీచిక,చతుర్వేద మాలిక
జీవన గమనానికి శాశ్వత చైతన్య దీపిక 

స్వాతంత్ర పోరుకు గీత జాతిపిత చేతిలో ఆయుధమై 
కర్మను చేసి అహింస మీద ఫలితం పొందిన
 నిష్కాముక భారత జాతి వెన్నెముక

 కౌన్సిలర్ పదానికి ఆది రూపమై నందించిన
గీతా సందేశం సర్వ మానవాళి  ఆత్మ స్వరూపం

ఈ బోధ 
మానవ జాతి  ఉనికి ఉన్నంత కాలం కనిపించే 
సమదర్శనపు విశ్వరూప సందర్శనంకామెంట్‌లు