విశ్వ సృష్టి కర్తలు:- డా.. కందేపి రాణీప్రసాద్.

జై జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై!
జై జై విశ్వకర్మ భగవానునికి జై!
జై జై విశ్వసృష్టి కర్తలకూ జై!
జై జై విశ్వకళా రూపులకూ జై!

శిలలకు ప్రాణం పోసి శిల్పాలుగా మార్చిన
మహాబలిపురం పంచాదాలకూ జై!
బండరాతిని సైతం నాలిగా మలిచిన
అజంతా ఎల్లోరా గుహల మూర్తులకూ జై!

పన్నెండు వేలమంది పట్టేల కట్టిన
నలందా విశ్వవిద్యాలయానికి జై!
పదహారు వందల ఏళ్ల క్రితందైన
తుప్పుపట్టని డిల్లీ ఇనుప స్తంభానికి జై!

చెన్నకేశవ, బ్రహదీశ్వరాలయాలు
కోణార్క సూర్యదేవాలయాలకు జై!
బేలేరు, హలెబీడు, రామప్ప
రమణీయ శిల్పకలలకూ జై!

అధ్బుత ఆలయాలను చెక్కిన
అమరశిల్పి జక్కనకు జై!
అద్వైత తత్వాన్ని భోదించిన
అది శంకరాచార్యునికి జై!

శ్రీకృష్ణ ద్వారకానగరం, రావణలంకా నగరం
ఇంద్రుని స్వర్గం, పాండవుల ఇంద్రప్రస్థానికి జై!
సింధులోయ నాగరికతను వికనింప జేసి
ఝాన్సీ రానికి ఆయుధాలు అందించిన వారికి జై!


ఖగోళాన్ని, గణితాన్ని ఆపోసన బట్టిన
వరాహ మిహిరుడు, భాస్కరులకూ జై!
భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైలు సింగ్
తెలంగాణా సిద్దాంతకర్త జయశంకర్ లకూ జై!

కృష్ణ దేవరాయల ఆస్థాన దిగ్గజం
కందుకూరి రుద్రకవికి జై!
భారతీయ జ్ఞాన పిట గ్రహీత
భరద్వాజ సాహిత్యానికి జై!

‘రామాయణన్నీ’ బుల్లితెర కెక్కించిన
‘రామానంద్ సాగర్’ కి జై!
‘జయహో’ పాటలో ఆస్కార్ పొందిన
‘గుల్జార్’ కవి పున్గావునికి జై! 
కామెంట్‌లు