పిన్నీసు పద్యాలు :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఆట వెలదులు 

పూసలమ్ము వారు పుణ్యమెంతయు జేసె 
బంధములను గల్పు బంధువులుగ
నిత్య జీవితమున నిజముగ పిన్నీసు 
వివిధ రీతులయ్యి వినియమగుచు!

గుండియలకు బదులు గుర్తుగా పిన్నీసు 
పెట్టి పరువు నిల్పు  పేద సాద
కాలి చెప్పు తెగిన కలవరమ్మునులేదు 
రవిక కుట్టు విప్పు రమ్యముగను!

పసుపు తాడు నందు పడతికి సాయమ్ము 
గుత్తి గయ్యి నూగు గూఢచారి 
కంటకమ్ము దీయ కమనీయ వైద్యుoడు 
దువ్వెనందు మట్టి దూరతీయు!

 జారిపోక పైట జాగ్రత నిడుచును 
లాగు వదులవగను లాగి యుంచు 
కలము ములికిలోన కాపువేసియుసిరా 
తుప్ప కట్టగాను  తొలగగొట్టు!

కామెంట్‌లు