వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(ఏడవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 25)
ఔషధములుగా ఉపకరిస్తాయి తరువులు
నిలువెల్లా ఉపయోగము ఆతనువులు
సరియగు రుద్రాక్ష ధారణ
భద్రమగు తనువు రక్షణ!
26)
గడ్డిజాతి దశ విధములు
గరికనుండి దర్భవరకు వివిధములు
సూర్యచంద్ర గ్రహణాల సమయమున
శుధ్ధికొరకు వాడుదురు నయమున!
27)
అమృత తుల్యమైన దర్భజాతిని
అన్నికర్మలలో వాడుక నియతిని
బ్రాహ్మణుల పనులు ముఖ్యముగ
అవిఉంటే జరుగును సఖ్యముగ!
28)
వింధ్య దండక నైమిష
లుంబిని కామ్యక నహుష
దారుక చంపక బదరిక
గుహారణ్య అనేవి మరువక!
(సశేషము)

కామెంట్‌లు