ప్రజాకవి:-కటుకం.రాజయ్య--తెలుగు భాషోపాధ్యాయులుప్రా.ఉ.పా:అలియాబాద్

సీ:ఖమ్మము జిల్లాన గూడూరు యందున
   పుట్టెను పులిబిడ్డ పుడమిపైన
   కృష్ణమాచార్యులు కృషినియెప్పుడునమ్మి
    దాశరథిగ వెల్గె ధరణియందు
   పాటలు పద్యాలు పరగ గానముజేసి
   జనముకై జీవించె జగతియందు
    తిమిరమ్ము తోతాను సమరమ్ము జేసియు
    తెలగాణ పౌరుషం తెలియపరిచె!!

తేగీ:రుద్రవీణను మీటెను రూఢి గాను
      అగ్నిధారలు నొలికించె యవనిపైన
      చెమట బట్టించె నైజాము  చేష్టలకును
      జనముమెచ్చిన కవియయ్యి జగతి వెలిగె!!
కామెంట్‌లు