*ప్రకృతి-నవ్వులు*;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 

68.తేలే మబ్బులు,
      దూదుల గుంపులు,
      పండు ముత్తయిదుల,
      సిగలో నవ్వుల మల్లెలు!
69.కోనేటి తామరలు,
      సరోవర కన్య,
      పరువంతో పలకరించే,
      పసిడి నవ్వులు!
70.పొలాన,
     నారుమళ్ళు చిరునవ్వులు,
   పెరిగిన పైర్లు విరిసిన సిరులు,
   ధాన్యలక్ష్మి నవ్విన నవ్వులు!
71.భూమి నవ్వు వరిచేలు,
      ఆకాశం నవ్వు హరివిల్లు,
      నీటి నవ్వు గలగల,
                   పారే సెలయేళ్ళు,
     నిప్పు నవ్వు ,
                యజ్ఞాల వాకిళ్ళు!
72.ఆకాశవధువు ముఖాన,
     పొగమంచు మేలిముసుగు,
     తొలిగిన నక్షత్రాల నవ్వులు,
  భావుకుల నేత్రాల వెలుగులు!
         ( కొనసాగింపు)

కామెంట్‌లు