అతడి లోని మనిషి..!!> శ్యామ్ కుమార్>నిజామాబాద్*

 జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకొని జీవించడం చాలా మందిని చూస్తూ ఉంటాం.  గెలుపు ఓటములను సమానంగా సేకరించి ముందుకు సాగడం అన్నది చాలా కొద్ది మందిలో ఉండే కళ. శ్రీకృష్ణుడు ఇటువంటి వారి  గురించి ప్రస్తావించి వాళ్లను స్థితప్రజ్ఞులు
 అన్నాడు.  జీవితంలో వచ్చే ఒడిదుడుకులను మరియు ఓటము లను ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ముందుకు సాగే వాళ్ళు కొందరు మాత్రమే.  నాకు తెలిసిన ఆ కొద్దిమందిలో ఒకరు నా స్నేహితుడు సంజీవన్   వకీల్.
 నిజాంబాద్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజీ లో నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు నాకు స్నేహితుడు సంజీవన్.  ఎదుటి వారు ఎటువంటి   స్వభావం కలవారు ఐనా సరే వారందరితో ఒకేరకంగా స్నేహంగా కలిసిపోయి ఉండేవాడు.  కానీ అవసరమైతే చాలా ధైర్యంగా  పరిస్థితులను ఎదుర్కొనే వాడు . దేనికి కూడా భయపడేవాడు కాదు. పైగా స్నేహితులకు ధైర్యం కూడా చెప్పేవాడు.దీనికి ఒక మంచి ఉదాహరణ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
 ఒకరోజుమాతో   కాలేజీలో చదివే ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చి తనను రోజు ఒక అబ్బాయి వెంట పడుతూ  వేధిస్తున్నాడని తెలిపింది.  చాలామంది అమ్మాయిలు మమ్మల్ని అన్నయ్యలు అని సంబోధించేవారు.        ఇంకేముంది ఇలా ఎవరైనా వచ్చి అడిగితే    ఏమీ చేయకుండా ఊరుకుంటే  'ఇజ్జత్
కా సవాల్ 'అని అనుకుంటూ  మేము చచ్చినట్టు  ఆ గొడవల్లో తలదూర్చి, అమ్మాయిలకు సహాయం చేసే వాళ్ళం. 
 మరుసటి రోజు ముందే అనుకున్నట్లుగా అమ్మాయి రిక్షా ను 
మా సైకిల్ ల  మీద దూరదూరంగా ఫాలో అవుతూ వెళ్ళాం.    చాలా దూరం వరకు ఎవరూ కనపడలేదు.  వాడెవడో ఈరోజు వచ్చేట్టు లేదులే అని వెనుతిరుగుదాముఅనుకునేంత లోపల ఎక్కడి నుంచో ఊడి పడ్డాడు  ఆ రోమియో. రిక్షా లోంచి తొంగి చూసి అబ్బాయి వైపు వేలు పెట్టి మాకు   సైగ చేసి వాడే అని చెప్పింది.  అప్పుడు చూశాను అశాల్తిని.  బక్కగా పీలగా పొడవుగా ఉన్నాడు.
 వెంటనే సంజీవన్ సైకిల్ ముందుకు ఉరికించి, మేము దగ్గరికి వెళ్ళే లోపుగా వాడిని ఆపి  నాలుగు  ఉతికే శాడు.  మేము ఆశ్చర్యపోయాం. సంజీవని పట్టుకుని ఆపి "ఒరేయ్! వారెవరో ఏంటో కొనుక్కుందాం !ఎందుకు తొందర పడ్డావు!!"  అనిఅన్నాను.   
" ఏంటి కనుక్కొనేది నా కొడుకుని "అంటూ,  ఆ బక్క  శాల్తి  తేరుకునే లోపు ఎడాపెడా వాయించడం మొదలుపెట్టాడు.  ఆ దెబ్బలు తింటున్న వాడికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు.  నేను అనుకున్నదానికంటే ఎక్కువే బాదేశాడు.  మేము అసలు వానిని బెదిరించి వార్నింగ్ ఇచ్చి పంపిం చేద్దామని అనుకున్నాం.
 ఇలా కాదు నువ్వు పద మా వెంట అంటూ వాడిని బలవంతంగా  మెడ వెనుక కాలర్ పట్టుకొని పోచమ్మ గల్లి లో ఉన్న తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.  మాకేం చేయాలో అర్థం కాక మేము వెంట వెళ్ళాం.   ఒక రూం లోకి తీసుకెళ్లి మేము ప్రశ్నలు సంధిస్తూ ఉండగానే మళ్ళీ వాడిని ఉతకడం మొదలుపెట్టాడు సంజీవన్ .
 ఆరోజు చూశాను సంజీవన్ మొక్క ఉగ్రరూపం.
 కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే చాలా సీరియస్ గా ఉండాల్సిన ఎన్సిసి ( Ncc)  లో జూనియర్ అండర్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ అందరితో కలుపుగోలుగా నవ్వుతూ ఉండేవాడు.
  ఎన్సిసి పరేడ్ అయిపోయిన తర్వాత  మాకు ఇచ్చే పూరీ లకు ఇంకా ఎక్కువగా ఇచ్చి అందరికీ తినిపించే వాడు.
సంజీవన్  తో దెబ్బలు తిన్న ఆ బక్కపలుచని కార్టూన్ మళ్ళీ మాకు ఎప్పుడూ కనిపించలేదు.  సంజీవన్   తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని హాయిగా పిల్లాపాపలతో ఇప్పటికీ సంతోషంగా నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాడు. జీవితంలో తన వృత్తి  కూడా   తన ప్రవృత్తికి తగ్గట్టుగా ఆడుతూపాడుతూ గడిపే ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఉద్యోగం దొరికింది.  పోలీస్ అకాడమీ లో ఈ మధ్య రిటైర్మెంట్ తీసుకొని హాయిగా ఉన్నాడు.నా జీవితంలో ఇది కూడా గొప్ప
 అనుభవమే మరి!
                       ***
ఫోటోలో...శ్రీమతితో సంజీవన్.
కామెంట్‌లు
Common man చెప్పారు…
True story sanjeevan .,but it s routine to him , similar incidents are plenty., that’s his life- style; if anyone get s trouble , they must call him for perfect solution
By Satyanarayana. Ts bc welfare
అజ్ఞాత చెప్పారు…
True story .,but it s routine to him , similar incidents are plenty., that’s his life- style; if anyone get s trouble , they must call him for perfect solution
By Satyanarayan