హాడారాణీ. ..అచ్యుతుని రాజ్యశ్రీ

 రూప్ నగర్  రాకుమారి  ప్రభావతి ని మొగల్ ఔరంగజేబు కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు తండ్రి  విక్రమసింహా! ఆత్మాభిమానం గల ఆపిల్ల  ఒక సామాన్య క్షత్రియ వీరుడిని పెళ్ళాడుతాను కానీ ఆయవనుడి బారిన పడను అని భీష్మించుకుంది. అందుకే ఆమె మహారాణా  రాజసింహుని శరణువేడింది. ఆమెను కాపాడాలి అని అనుకున్నాడు. కానీ  ఆదుష్ట మొగల్ శాసకుని ముందు  తన శక్తి  చాలదు కాబట్టి మాయోపాయంతో ముందడుగు వేశాడు. ఇరవైఏళ్ల సర్దార్ వీరుడైన చందావత్ "ప్రభూ! నేను మొగల్ సైన్యంని అడ్డుకుంటాను"అని ముందు కొచ్చాడు. హాడారాణీ తో కొత్త గా పెళ్ళి అయిన  ఆ యువకిశోరం ప్రాణాలకు తెగించాడు.16ఏళ్ల  నవవధువు హాడారాణీ  అత్తింట అడుగుపెట్టి  కేవలం  మూడు రోజులైంది. అన్నివిద్యలలో నిపుణురాలైన ఆమె భర్తకు వీరతిలకం దిద్ది సాగనంపింది.  కానీ వెంటనే అతను లోపలికి వచ్చి  " హాడా!నేను  తిరిగి వస్తాను అనే నమ్మకం లేదు. నీమానంతోబాటు మన వంశగౌరవం కాపాడు"అన్నాడు. "స్వామి!మీరు వీరమరణం పొందితే నేను  సతీసహగమనం చేస్తా"అని వాగ్దానం  చేస్తుంది.   అతను  వెళ్లి పోయాక భర్త  వీరోచితంగా పోరాడాలి. భార్య పైన ధ్యాస పెట్టి సరిగ్గా యుద్ధం చేయడేమో అని  ఆలోచించింది.భర్త కు ఓలేఖ రాసి దాసితో "ఈలేఖ తో పాటు  నేను ఖండించుకున్న  నాతలను  నాభర్తకు అందజేయి"అని సర్రున కత్తి తో  మొండెం నించి  తలను వేరు చేస్తుంది.  భార్య త్యాగం ని గుర్తించిన  చందావత్ వీరోచితంగా పోరాడి  అసువులు బాశాడు. మనకు ఇది ఘోరంగా  అనిపించవచ్చు.కానీ  తురుష్కులచేతిలో తన భార్య  చిక్కికూడదు అని అతని ఆవేదన. ఇలాంటి  త్యాగమూర్తుల  గాథలు వింటే మనలో దేశభక్తి  దేశప్రేమ ఉప్పొంగిపోతాయి కదూ?
కామెంట్‌లు