*చెట్లు*(బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఇంటిముందు చెట్లు
ఇంటివెనుక చెట్లు
బాటపక్కన చెట్లు
కోటపక్కన చెట్లు
గుడిలోన చెట్లు
బడిలోన చెట్లు
పూలనిచ్చే చెట్లు
పండ్లనిచ్చే చెట్లు
కాయలిచ్చే చెట్లు
కూరలిచ్చే చెట్లు
మోకులిచ్చే చెట్లు
మందులిచ్చే చెట్లు
కూడునిచ్చే చెట్లు
గూడునిచ్చే చెట్లు
గుడ్డనిచ్చే చెట్లు
గాలినిచ్చే చెట్లు
వానలిచ్చే చెట్లు
జీవుల కాపాడే చెట్లు
భూమిని కాపాడే చెట్లు
అందుకే మనమంతా
పచ్చనిచెట్లను అవనికి
పచ్చలపతకపు హరితహారాన్ని
నజరానాగా ఇద్దాం!!

కామెంట్‌లు