శ్రీ పాల్కురికి సోమనాథుని ఘనత :--- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
సీసమాలిక పద్యం

రామి దేవుడు శ్రియా రమణీయ దంపతుల
పుణ్యాల పంటయేపుత్రుడితడు,
సోమనాథుడు పుట్టె సుందర రూపున
కారణా జన్ములు  ఘనుడునితడు,
సంస్కృతాంధ్రమ్ములు చక్కగా నేర్చియు
కర్ణాట భాషలు గణము చదివి,
పాల్కురి సోమన్న పండితారాధ్యము
రచించె తెలుగున రమ్యముగను,
కావ్య సరస్వతీ కరుణించ పాల్కూరి
దేశీయ ఛందస్సుతెలియపరిచె,
సారమతీంద్రుడై  సాహితీలోకాన
పద్యగద్యాలతో పరవశించె,
శతకం వృషాదిప  చక్కగా రచియించె
కావ్య పురాణము కనగ మనము,
శైవ మతము బోధ చాటగా భక్తితో
శివకవి యుగము గా చెప్పబడెను,
సర్వజ్ఞ ,శారదా చక్కని బిరుదులు
సాహితీవనమున సాగెనితడు.

తేటగీతి

మల్లికార్జున చరితమ్ము మరులు గొలుపె,
రగడ , స్తవములు మేటిగా రచన జేసె,
బసవలింగ నామావళి వరలుచుండ
తెలుగు సాహిత్య మందునా తేజ మితడు.


కామెంట్‌లు