*స్వర్ణాక్షరం**: --- కె.స్వాతి నీర్మాల గ్రామం

చదువు ఓ చెట్టు అయితే
పుస్తకం ఓ పువ్వు అయితే
ప్రతీ అక్షరం పరిమళిస్తుంది

చదువు ఓ సంస్కారం
ఆట ఓ విజయం
ఉపదేశం ఓ ఉద్యోగం
జీవితం ఓ జీతం
అభివృద్ధి ఓ ఆనందం
పురస్కారం ఓ పుణ్యం
మరణం ఓ   మట్టి
బ్రతుకు ఓ తెల్లకాగితం
అందులో ప్రతీ అక్షరం 
ఓ కష్ట ఫలితం
మన జీవితం మనమే
స్వయంగా రాసుకున్న
స్వర్ణాక్షరం

కామెంట్‌లు