*ప్రకృతి-నవ్వులు*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 64. వనాన వసంతం!
      శుష్కించిన చెట్లు!
       వళ్ళంతా పచ్చని,
       చిగురుల నవ్వులు!
65.జలపాతం,ధరణిపై,
      కొండలనుంచి జారి,
      ఎగిసిపడే తుంపరల,
      చల్లని జల్లుల నవ్వులు!
66.సముద్రం,
      అవిశ్రాంతంగా,
      ఒడ్డున చేర్చే,
      ఎగిసిపడే అలల నవ్వులు!
67.నక్షత్రాలు,
      ఆకాశం వస్త్రాన కుట్టిన,
      చిరు జరీపువ్వుల,
     తళుక్కున మెరిసే నవ్వులు!
           (కొనసాగింపు)

కామెంట్‌లు