భక్తవత్సలుడు -సాహితీసింధు సరళగున్నాల
చం*సతతము భక్తబృందముకు శాంతినిగూర్చెడుశంఖచక్రముల్
జతనముజేయు నక్షియును చల్లనిచూపుల జల్లులందగన్
ప్రతిదినమందునామమది భాసురమైమమురక్షజేయగా
నతులితభక్తితోడ మిమునాశ్రితవత్సల జేరికోల్తుమే

ఉ*కొండలయందునన్నిలిచి కోరినకోర్కెలనెల్లదీర్చిమా
యండగ నుండి బాధలను హాయిగనోర్చెడిశక్తినిచ్చుచున్
భాండమునంతగాగలుగు భారములెల్లయువేంకటేశుడున్
దండిగకూలదోసి మము దారికిదెమ్మని చేరిమ్రొక్కుదున్

తే.గీ*ఎల్లలోకమ్ములన్గాచు నేలికయ్యి
భక్తసులభుడుశ్రీశ్రీనివాసుడెపుడు
కోరకోర్కెలుదీర్పగ  కొలువుదీరె
ఏడుకొండలనాస్వామి నెపుడుగొలుతు


కామెంట్‌లు