మనుషుల్లో దేవుడు...!!: >శ్యామ్ కుమార్.చాగల్>నిజామాబాద్

  ప్రతి మనిషి జీవితంలో భగవంతుడు  ఏదో ఒక రూపంలో వచ్చి అవసరం అయిన సహాయం అందించి వెళ్ళి పోతాడు. అలా చేసిన వ్యక్తి మనకు బంధువు, చుట్టము, స్నేహితుడు అన్నీ . కానీ మళ్లీ మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనకు కనపడకుండా వెళ్ళిపోతాడు.  ఇలాంటి ఉదంతాలు 
చాలామందిజీవితాల్లో చూస్తాం. అలాంటి నా అనుభవం ఒకటిమీముందువుంచే సాహసంచేస్తాను       నేను ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం నాగార్జున సాగర్ లో, రెండవ సంవత్సరం నిజాంబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదివాను.  
 ఇంటర్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్లుగా రిజల్ట్స్ వచ్చాయి.  ఆ తర్వాత ఏం   చదవాలి? ఎక్కడ జాయిన్ కావాలి ? అని చెప్పే వారు  , మార్గదర్శనం చేసే వారు  ఎవరూ లేరు  .  మా తాతల కాలం నుంచి   సన్నిహితంగా ఉండే   రామారావు తాతకి ఉడిపి హోటల్ ,   రైల్వే స్టేషన్ ముందట ఇప్పటికీ ఉంది.,  అక్కడికి వెళ్లి   శాంత, రుక్మిణి అక్కలను ,  ఎక్కడ ఏ కోర్సులో జాయిన్ కావాలి అని వారి అభిప్రాయాలను అడిగాను.    వారు కూడా అప్పుడే డిగ్రీ చదువుతున్నారు. నాకంటే మహా అయితే రెండు సంవత్సరాలు పెద్దవారు అనుకుంటా .
"బీకాం చదువుతే బ్యాంకులో ఉద్యోగం వస్తుంది. అందులో కామర్స్ అకౌంటెన్సీ లెక్కలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి"  అన్నారు. . 
లెక్కలు అన్న మాట వినగానే నాకు గుండె    జారీపోయింది.  "అబ్బో! లెక్కలు ఉంటే లాభం లేదు. అక్క! ఇంకా వేరే ఏదైనా  చెప్పండి" అన్నాను. 
 "అయితే బి జెడ్ సి తీసుకో   " అన్నారు. 
 ఇక చేసేదేమీలేక తప్పనిసరై బి ఎస్ సి, బి జెడ్ సి చేద్దామని నిశ్చయించుకున్నాను.
 గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ కి వెళ్లి అప్లై చేశాను.   ఒక నెల తర్వాత  కాలేజీకి వెళ్లి నోటీస్ బోర్డులో చూసుకుంటే  నాకు  మెరిట్ లిస్టు  పదవ ర్యాంకులో , బి ఎస్ సి లో సీట్ వచ్చింది.  ముందుగా కట్టవలసిన 45 రూపాయలు మా నాన్నగారు   సమయానికి కట్టేసారు.
 కాలేజీ మొదటిరోజు నడుచుకుంటూ వెళ్లాను దాదాపుగా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. మా క్లాసు లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. 
 అందరూ క్లాస్ కి  టెక్స్ట్ బుక్స్ తీసుకొని రావాలి అని మొదటిరోజు లెక్చరర్స్ చెప్పారు.  అవన్నీ కొనాలంటే దాదాపుగా  400 రూపాయల వరకు కావాలి.  మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి  దానికి అనుకూలంగాలేదు.  దానికి కారణం  మా నాన్నగారు  ఎన్నుకున్న జర్నలిజం వృత్తి.  ఇంటి బయట ఎంతో పలుకుబడి ఉండేది . సినిమాలు ,థియేటర్లు, డాక్టర్లు ఫ్రీ!!   అయితే ఇంట్లో మాత్రం అన్నిటికీ కొరతే!  కడుపునిండా భోజనం ప్రతి రోజు దొరికితే చాలు అనుకునే  పరిస్థితిలో మా కుటుంబం ఉండేది.
 కాలేజీ లైబ్రరీలో కూర్చొని అన్ని  టెక్స్ట్ పుస్తకాలు చదువుకోవచ్చు.  కాలేజీ లో ఉన్న బుక్ ఫండ్ అనే సెక్షన్ కి వెళ్తే, ఏవైనా సరే రెండు టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేవారు.   దానికి ఇన్చార్జిగా  ఖాన్ సాబ్  అని ,గడ్డం పెంచుకొని  టోపీ పెట్టుకుని ఉండే వారు . ఒకరోజు ఆయన దగ్గరికి  వెళ్ళి ఎదురుగా నిలబడి నా ఆర్థిక పరిస్థితి చెప్పాను. నాకు రెండు కంటే ఎక్కువ పుస్తకాలు ఇవ్వడానికి వీలవుతుందా అని ఆయనని  చాలా వినయం గా సహాయం అడిగాను.  అతను నాకేసి తేరిపార చూశాడు. నా మొహాన్ని గమనించాడు.    నన్ను చూసి ఆయనకు ఏమి అర్థం అయిందో  తెలియదు ఆ వయసులో. 
" సరే బాబు   ఇస్తాను .కానీ పరీక్షలు అయిపోగానే మళ్ళీ  వెంటనే తెచ్చి ఇవ్వాలి. ఇది నా సొంత పూచీకత్తుపై నీకు ఇస్తున్నా ను". అని నాకు ఆ విధంగా మొదటి సంవత్సరం నుంచి మూడవ  సంవత్సరం వరకు పుస్తకాలు  ఇస్తూ వచ్చాడు .
 నేను మొదటి నెల జరిగిన పరీక్షలలో, క్లాసులో అందరికంటే అత్యధికంగా మార్కులు  సంపాదించడం జరిగింది.  ఆ  తరువాత అందరి దృష్టి నా మీద పడింది.  లెక్చరర్స్ అందరూ నన్ను  గుర్తించి  క్లాసులో పాఠం చెబుతున్నప్పుడు నన్ను వారు  కాస్త ప్రత్యేకంగా చూడడం గమనించాను  నా  తోటి వారందరూ నన్ను చూస్తూ ఉంటే కించిత్ గర్వంగా కూడా  అనిపించింది.  ఆ క్రమంలో నాకు నలుగురు  మంచి స్నేహితులుగా మారారు.
 కాలేజీలో శ్రీనివాస్, కామేశ్వరరావు , వెంకటేశ్వర రావుల స్నేహం నాకు  కావలసిన మానసికమైన బలాన్ని , ఉత్సాహాన్ని ఇచ్చిందనె చెప్పాలి .  వీళ్ళందరూ కూడా బాగా తెలివైన వారు . కాలేజీ లో చురుకుగా ఉంటూ అన్నిటా మంచి మార్కులు తెచ్చుకునే వారు.   వీరి సాన్నిహిత్యం నాలో మంచి మానసిక వికాసాన్ని కలిగించిందని కూడా చెప్పాలి.
  రాధాకృష్ణ అనే కేరళకు చెందిన  మా కాలేజీ విద్యార్థి , మా ఇంటి దగ్గరే ఉండే వాడు .  తను చదివేది బీకామ్ అయినప్పటికీ చదువు విషయంలో నాతో చాలా చర్చించేవాడు.  తనకు హిందూ పేపర్  పూర్తిగా  చదివే అలవాటు ఉండేది.  ప్రతి రోజు  చదివే వాడు.  ఇంగ్లీషులో అతనికున్న పరిజ్ఞానం చాలా ఎక్కువనే చెప్పాలి.  ఈ విషయంలో నేను అతన్ని ,అతని  కి  తెలియకుండా అనుకరించి కాలేజీలో ఆ తర్వాత రోజుల్లో ఆంగ్లంలో  అత్యధిక మార్కులు తెచ్చుకొని కాలేజీలో  మెరిట్ సర్టిఫికెట్   పొందాను.    ప్రతిరోజు సాయంత్రం రాధాకృష్ణ ఇంటికి వెళ్లి వారు చదివేసిన హిందూ పేపర్  ఇంటికి తీసుకెళ్లేవాడిని.  హిందూ పేపర్ కొనగలిగే ఆర్థిక వెసులుబాటు మా ఇంట్లో లేదు.   నిజం చెప్పాలంటే  ఒక్కొక్కరోజు మా ఇంట్లో రాత్రి పూట   మేమందరం పస్తులు ఉండాల్సి వచ్చేది. దానికి మేము బాధ పడే వాళ్ళం కాదు . మాకు దాదాపుగా అది అలవాటు అయిపోయింది.  కడుపునిండా మంచినీళ్లు తాగి ఆరుబయట చాపలు వేసుకుని పడుకునే వాళ్ళం.  ఆ సమయంలో మా అమ్మ మంచి మంచి పాటలు పాడేది. అవి  వింటూ  ముందు ముందు మంచి రోజులు వస్తాయి అనే నమ్మకంతో, మంచి రోజులు గురించి  ఆశావాదం  తో కలలు కంటూ నిద్ర పోయే వాళ్ళం.
 చూస్తూ ఉండగానే మొదటి త్రైమాసిక ఫీజు కట్టే సమయం వచ్చింది.  
 అవి దాదాపుగా 45 రూపాయలు అన్నట్టుగా గుర్తుంది.   ఎంతో ఇబ్బంది పడుతూ , చాలా కష్టం తో మా నాన్న గారిని  రెండు మూడు మార్లు అడిగాను. ఆయన మారు మాట్లాడకుండా తల దించుకొని బాధతో వెళ్లిపోవడం గమనించాను.
 ఆఖరు తేదీ దాటిన తర్వాత కొద్ది రోజులకి ఫీజు కట్టని వాళ్ళ లిస్టు లో నా పేరు వచ్చింది .  వారంలోగా కట్టకుంటే   కాలేజీ నుంచి  పేరు తొలగిస్తాం అని అందులో ఉంది. 
 ఆఖరి రోజు వరకు ఎదురు చూసి, ఏం చేయాలో తెలియక ఊరికి దూరంగా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి చాలా సేపు కూర్చున్నాను.  గుడి మూసివేసిన తర్వాత బయట దూరంగా  వున్న రాళ్ల  పైన , పెద్దపెద్ద వృక్షాల కింద చీకట్లో  కూర్చున్నాను.   విపరీతమైన గాలికి  ఆ  వృక్షాలు బలంగా అటూఇటూగా    వూగిపోతున్నాయి .  ఆకాశంలో దట్టంగా  నల్లటి మేఘాలు  కమ్ముకు వొస్తున్నాయి.  ఉన్నట్టుండి వర్షం కురవడం మొదలుపెట్టింది.  ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.  ఒక నిమిషంలో పూర్తిగా తడిసి పోయాను.  నా కళ్ళ నిండా కురుస్తున్న కంటి నీరు వర్షం  తో కలిసి పోయింది.  ఉరుములు మెరుపులు . దగ్గర్లోనే పెద్ద పిడుగు పడ్డట్టుగా చెవులు బద్దలయ్యే చప్పుడు.  పిడుగు పడి చని పోతానేమో అని  బ్రతుకు  మీద భయం కూడా వేయలేదు.
 ఎవరూ లేరని, ఎవరూ చూడటం లేదు అనే ధైర్యంతో , బిగ్గరగా  భోరుమని, వెక్కివెక్కి ఏడ్చేశాను.  దాదాపు రెండు గంటలు కురిసిన వర్షం  ఆ తర్వాత  తెరిపిచ్చింది .  నేను కూడా 
తేలికైన మనసుతో ఇంటి దారి పట్టాను.  ఇంట్లో అందరి కంటే నేను పెద్ద అన్నయ్యను కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నట్టుగా, గంభీరంగా ఉండే వాడిని.  "నేను డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి అందరి కష్టాలు తీరుస్తాను, మన కష్టాలు  త్వరలో తీరుతాయి " అని అమ్మకు  ఎప్పుడూ  ధైర్యం చెప్పే వాణ్ని. 
మరుసటి రోజు ఉదయం ఆదివారం మనసులో ఒక చిన్న ఆశ అంకురించింది .  అంత డబ్బు,  ఫీజు కట్టే వారు ఎవరు నాకు కనిపించలేదు కాని  మా ఇంటికి కాస్త దగ్గరలో జిల్లా పరిషత్ క్వార్టర్స్లో ప్రిన్సిపాల్ గారైన శ్రీ పూర్ణ చందర్ రావు గారు ఉంటారని  తెలుసు.   వారిని కలిసి ఏదైనా సహాయం   కోరితే బాగుంటుందేమో? అనిపించింది.   నాకు వచ్చిన ఆ ఆలోచన చాలా          అసమంజసం గా అనిపించింది,  కానీ మరింకే దారిలేక వారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.    ఉన్నవాటిలో మంచి  బట్టలు వేసుకొని,  మనసులో దేవుని స్మరించుకుని  శ్రీ పూర్ణచంద్ర రావు గారి ఇంటికి బయలుదేరాను.  గేటు బయట  నిలబడి అక్కడ ఉన్న కాలింగ్ బెల్ నొక్కాను.  వెంటనే వారి అమ్మాయి, (మా కాలేజీలో చదువుతుంది, )వచ్చి    నన్ను గుర్తుపట్టి నా కేసి ప్రశ్నార్థకంగా చూసింది.  "ప్రిన్సిపాల్ గారిని కలవాలని వచ్చాను  " అన్నాను చేతులు కట్టుకొని.
 ఏమి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చి నన్ను చూసి "ఏంటి బాబు ,ఏంటి సంగతి ?" అన్నారు.
" మీతో  కాస్త    మాట్లాడాలి సార్ "అన్నాను చేతులు కట్టుకొని. 
 ఆయన  ఎత్తయిన అరుగుమీద  నిలబడి నన్ను కాసేపు చూశారు.
 "సరే లోపలికిరా "అంటూ ముందు రూం లోకి తీసుకొని వెళ్ళారు అక్కడున్న ఈజీ చైర్ లో కూర్చుని" ఆ ! ఏంటి చెప్పు బాబు నీ విషయం" l అన్నారు.
 నా పరిస్థితి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో ఏమని చెప్పాలో అసలు ఏమి చెప్పాలో నాకు  తెలియకుండా అగమ్యగోచరంగా ఉంది.
 ఒకవైపు చెప్పుకోవడానికి బాధగా ,దుఃఖంగా ఉంది.  కళ్ళలో నుంచి  వస్తున్న నీటిని బలవంతంగా ఆపుకొని, గొంతు పెగల్చుకుని చెప్పాను.
 "సార్ నాకు మొదటి టర్మ్ ఫీజు కట్టమని నోటీసు ఇచ్చారు .మా నాన్నగారు కట్టే పరిస్థితుల లో  లేరండి.  ఫీజు కట్టకుండా  రేపటినుంచి క్లాస్ కు రాకూడదని సర్క్యులర్ వచ్చింది సార్. 
 ఏమీ చేయలేక మీ దగ్గరికి వచ్చాను"  అని చేతులు కట్టుకొని  చెప్పి ఆయన ముఖాని కేసి చూస్తూ నిల్చున్నాను. 
"ఎందుకు ?నీకు ఫీజు కన్ఫెషన్స్ ఏమీ లేవా?" అని అడిగారు .
"ఏమీ లేవు. సార్ పూర్తిగా కట్టాలి"  అన్నాను 
"ఎలా మరి ? మీరు ఏ కాస్ట్?"
 తల   వంచుకొని సిగ్గుతో చెప్పాను "మేము బ్రాహ్మిన్స్ అండి"
"   మరి అలాంటప్పుడు ఎటువంటి ఫీజు  రాయితీలు ఉండవు కదరా?"   నన్ను చూస్తూ  తనలో తను ప్రశ్నించుకున్నారు.
 నేను తలవంచుకొని చెప్పాను 
"నేను  ఫీజు ఏమాత్రం కట్టలేని పరిస్థితిలో  ఉన్నాను సార్. మీరు ఏదైనా సాయం చేస్తే నా చదువు కొనసాగుతుంది లేదంటే నేను రేపటి నుంచి కాలేజీ మానేయవలసి వస్తుంది సార్ " అని దుఃఖాన్ని  దిగమింగుతూ చెప్పాను.
 కాసేపు అలాగే నన్ను చూశారు . చూసి "సరే  రేపు ఉదయం నువ్వు కాలేజీ కి రా !" . అని చెప్పి  కుర్చీలోంచి లేచారు.  సరేనంటూ   కళ్ళల్లో ధారగా కారుతున్న  నీరును తుడుచుకుంటూ  వెనక్కి తిరిగాను. 
 నేను సరేనంటూ రెండు చేతులతో నమస్కారం పెట్టి ఆయన మీద,  దేవుడి మీద భారం వేసి వెనక్కి అడుగు వేసాను.  తలుపు తెరచి పక్కనుంచి ప్రిన్సిపాల్ గారి అమ్మాయి ఇవన్నీ వింటూ ఉండడం గమనించాను. 
 ఆయన మాత్రం ఏం చేయగలరులే  అని ఆశ వదులుకొని మరుసటి రోజు కాలేజీకి వెళ్లాను. ఆరోజు  కాలేజీకి ఇంక ఆఖరి రోజు  అనుకుంటూ నేను  అన్ని ఆశలు వదులుకొని క్లాసు అటెండ్ చేయడం మొదలుపెట్టాను. మొదటి  గంట గడిచిన తర్వాత రెండవ గంట జువాలజీ సబ్జెక్టు  మొదలయ్యింది. 
 ఆ సమయంలో  ఒక నాలుగవ తరగతి ఉద్యోగి సర్క్యులర్ రిజిస్టర్ పట్టుకొని లెక్చరర్ దగ్గరికి వచ్చాడు.   ఆయనది  చదివి " శ్యామ్ కుమార్!!!" అని   సీరియస్ గా పిలిచారు.   నేను అనుకున్నట్లుగానే  నన్ను క్లాస్ నుంచి బయటకు పంపడం జరుగుతుంది అని లేచి నిలబడ్డాను.
 "బాబు !నీవు కట్టవలసిన ఫీజు లు  అన్నీ  ఇప్పటి నుంచి కాలేజీ భరిస్తుంది.!  అయితే  చదువులో మీయొక్క కృషిని బట్టి  కాలేజీలో నీ సత్ప్రవర్తనను బట్టి ఈ సౌకర్యం  కొనసాగుతుంది!!   ఈ రెండు విషయాల్లో సంతృప్తికరంగా లేనప్పుడు నీకు ఈ సౌకర్యాన్ని తొలగిస్తారు.  ఇది ప్రిన్సిపాల్ గారు పంపించిన సర్క్యులర్"   అని నన్ను ,చాలా గంభీరంగా చూసి దానిపై సంతకం చేసి  ఆ రిజిస్టర్ ను వెనక్కి తిప్పి పంపించేశారు. 
 చదువుకోవడానికి ఈ విధంగా  అర్థించ వలసి వస్తుందని జీవితంలో అప్పటివరకూ ఎప్పుడూ అనుకోలేదు.  
 నాకు దుఃఖం పూర్తిగా  ముంచుకు వచ్చేసింది.  లోపలినుంచి తన్నుకొస్తున్న ఏడుపుని అతికష్టంగా ఆపుకున్నాను.  ప్రిన్సిపాల్ గారికి వెయ్యి దండాలు పెట్టుకున్నాను. 
 ప్రిన్సిపాల్ గారు ఎందుకు ఫీజు రాయితీ ఇచ్చారు? నాకు మాత్రమే   ఫీజు కాలేజీ  ఎందుకు  భరిస్తుంది అని ఎందరికో కలిగిన సందేహం.     ఆ విషయంపై  చాలామంది స్నేహితులు  కుతూహలంగా ప్రశ్నించారు.
 నేను నా అసహాయతను చెప్పలేక  చిన్న నవ్వు నవ్వి మౌనాన్ని పాటించే వాడిని.  భగవంతుడిని ప్రార్థిస్తే మనకు సహాయం చేస్తాడని,   నాకున్న నమ్మకం  ద్విగుణీకృతం అయింది. అంతేకాదు మనుషుల రూపంలో దేవుడు ఉంటాడు అని దేవుడు  మనుషుల రూపంలో వచ్చి ఆదుకుంటాడని  ఎందరో అనుకునే విషయం నిజమయింది.  
 చదువులో నిస్వార్థంగా నాకు సాయం చేసిన స్నేహితులు  వెంకు,కామేష్, శ్రీనివాస్  లకు నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను.
 నాకు చదువు చెప్పిన  గురువులు నిజమైన దేవుళ్లు .  నేను చదివిన ,  నా ఫీజులు భరించిన గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ నాకు నిజమైన ఆలయం.   నా చదువు కొనసాగడానికి సహాయం చేసిన మరియు దానికి కారణభూతుడైన శ్రీ పూర్ణచంద్ర రావు గారు నాకు భగవంతుడితో సమానం.  నేను ఆ కాలేజీలో చదివినన్ని రోజులు శ్రీ పూర్ణ చంద్ర రావు గారు    ఏ రోజు కూడా మళ్ళీ నన్ను పిలిచి  ఈ విషయంపై  మాట్లాడలేదు.  ఆయనకు నా  హృదయపూర్వక నమస్సుమాంజలి
                           ***
కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
అందిన మేలు
పొన్దిన అనుభవం
ఇప్పటికీ గుర్తుంచు కోవడం
నీ కృతజ్ఞతా భావంలో
అందరికి అందవలసిన
గొప్ప సందేశం వుంది.
ఇన్దులో సందేహం ఏమాత్రం లేదు.
అభినందనలు రచయిత కు.
------కెఎల్వీ*
హన్మకొండ.

Shyamkumar chagal చెప్పారు…
బాధాతప్త హృదయంతో వ్రాసిన నా గతం , ప్రచురించిన యాజమాన్యం శ్రీ వేదాంత సూరి గారికి ఈ విషయాన్ని రాయడానికి అక్షర రూపం లో పెట్టడానికి సహాయ సహకారాలు అందించిన డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు
Kolanu venkatera reddy. Chrlapalli jsil supd. Bsc 1980 చెప్పారు…
ఆ రోజుల్లో, పేదరికం, ఆర్థిక ఇబ్బందులూ, very common

చాలా మందికి, ఇటువంటి అనుభవాలు ఎన్నో

తండ్రి లేని పిల్లలు, చుట్టాల ఇంట్లొ, వాళ్ళ దయతో చదువుకున్న వాళ్ళు ఎందరో

ఒకటే జత బట్టలతో సంవత్సరమంతా గడిపేవాల్లు, ఎందరో

Shyam Kumar గారు, మనసువిప్పి, ఆ రోజులను, అప్పుడు తనకు సహాయం చేసినవారిని గుర్తు పెట్టుకోవడం, మనందరికీ మన పాత రోజులను గుర్తుకు తేవడం, అతని మంచితనానికి, నిష్కల్మష మైన మనసుకు తార్కాణం

Purna Chandra Rao గారి ఇల్లు, మా Colony లోనే వుంది (New Nallakunta)
మాకు నాలుగు ఇండ్ల అవతల

60 లలో వున్న మమ్మల్ని, 20 లలోకి తీసుకెళ్ళుతున్న, Shyam Kumar గారికి, మనస్ఫూర్తిగా ధన్యవాదములు, అభినందనలు 🙏

KV Reddy
B.Sc., BZC
1978-80
Lingam bhongir చెప్పారు…
Sham antey allari , kontey Babu, anukunnamu, ardika problem anubha vinchina nee anubhavalu, kanniti nee karcheyadam . Nanem kee two sides laga
[30/: Jeevitham okaside matramey telustadhi
[30/: Second side cheppu kuntey kani teluvadu, annaiah
[30/ We never expect this situation annaiah
M. Raveender reddy. Organic hills. Hyd చెప్పారు…
You are writing and recording a chronicle which we just feel in memory lane. Thanks for doing same. M raveender reddy. Organic hills . Hyderabad
Tangudu sujatha mumbai చెప్పారు…
Hmmmm
When read this kind of stories
Then have feeling sooo lucky
Never face this kind situation
Obviously this kind of person value of money & education
Rakesh చెప్పారు…
మీలాగే ఆర్థిక వనరులు అంతగా లేని తెలంగాణ ప్రాంత బ్రాహ్మణ విద్యార్థులు (మంథని, ధర్మపురి, బాసర, వేములవాడ, చెన్నూరు, అచ్చలాపురం, ఇంకా ఎన్నో గ్రామాల నుంచి) పైజామాలు, దోవతులు ధరించినా డిప్లొమాల స్థాయి నుండి పిహెచ్డీ ల వరకూ, ఇంజనీరింగ్, మెడిసిన్ లలో గోల్డ్ మెడల్స్ సాధించిన వారుగా రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారుగా ఖ్యాతి పొందిన వారు... బీదరికం, రిజర్వేషన్లు కృంగదీసినా గెలిచి నిలిచిన ఉదంతాలు ఎన్నెన్నో...
Kandula కామేశ్వరరావు.. Bcon.1978 చెప్పారు…
Dear Shyam, your true feelings are highly emotive and heart churning. I really appreciate your forthright ness, in sharing with us the inner truth of your heart. I travelled a long way with you and I am simply moved. My love to you. Kamesh
Bcom 1978.gg college .nizamabad
నారా venkateshwara rao, Bsnl nizamabad చెప్పారు…
Dear friend Syamkumar garu,
మీ కళాశాల అనుభవాలు ఇంచుమించుగా నా అనుభవం తో నూ, ఎంతోమంది ప్రతిభ కలిగి ఆర్థిక స్తోమత లేని వారు పడెబాధలకు, అనూహ్య మలుపులు తో కూడిన విజయాలకు దర్పణం లా వుంది. కథా గమనం అద్భుతం. మీ ప్రధా నా ధ్యాపకుల సాయాన్ని గుర్తుంచుకోవడం చేసిన మేలు ను క్షణాలలోనే మరచే ఈరోజుల్లో మీ కృ తజ్ఞతా భావానికి నిదర్శనం. ప్రతి విద్యా ర్థి కి ఇంటర్మీడియట్ గొప్ప మలుపు.ఒక ఐ డి యా మీ జీవితాన్ని మారుస్తుంది అంటే అదే.
Birds with Same Feathers floak together, అంటే ఇదే. ఓకే మనస్తత్వం ఒకే జీవిత గమనం కలవాళ్ళు ఒక వేదికపై కలుస్తారు అనేదానికి మన జీవితాలు కూడా ఒక ఉదాహరణ కాకపోతే ఇద్దరం ఒకటే గ్రూపు విద్యార్థులు అవ్వడం ,అత్యధిక మార్కులు సంపాదించుకొని scholarships పొందటం, రచనలలో నూ నటన లోనూ ప్రవేశం కలిగి ఉండటం కళాశాల జీవితంలో విలాసాలు, కష్టాలు, యాదృచ్చికంగా కలవటం మనం మంచి మిత్రులు కావడం most probably, Universal Law లో భాగమే.
Rakesh marupaka. Moldtek .hyd చెప్పారు…
మీలాగే ఆర్థిక వనరులు అంతగా లేని తెలంగాణ ప్రాంత బ్రాహ్మణ విద్యార్థులు (మంథని, ధర్మపురి, బాసర, వేములవాడ, చెన్నూరు, అచ్చలాపురం, ఇంకా ఎన్నో గ్రామాల నుంచి) పైజామాలు, దోవతులు ధరించినా డిప్లొమాల స్థాయి నుండి పిహెచ్డీ ల వరకూ, ఇంజనీరింగ్, మెడిసిన్ లలో గోల్డ్ మెడల్స్ సాధించిన వారుగా రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారుగా ఖ్యాతి పొందిన వారు... బీదరికం, రిజర్వేషన్లు కృంగదీసినా గెలిచి నిలిచిన ఉదంతాలు ఎన్నెన్నో..
Namilikonda విశ్వేశ్వర శర్మ చెప్పారు…
బాగుంది. నేను ఈరోజు చేసిన పోస్ట్ యొక్క సారాంశం ఇందులో కనిపిస్తుంది. మనిషికి మనిషి సహాయం చేయడం చాలా అవసరం. ఉన్నదాంట్లో చేతనయిన, యథాశక్తి సహాయం చేయాలి. చేసిన సహాయాన్ని మరిచిపోవాలి. నేను ఫలానా వాడికి సహాయం చేసాను అని గుర్తుంచు కొంటె మనం చేసిన సయహం విలువ ఉండదు. సహాయం అందుకున్న వారు మాత్రం ఆ సహాయాన్ని మరువ రాదు. నిజ జీవతంలోని చక్కని అనుభవం. అందించినదుకు ధన్యావాదాలు. 🙏

నమిలికొండ విశ్వేశ్వర శర్మ
వడ్డి రమణి. State education dept చెప్పారు…
Already chadivesaa...manasuni kadilinchina incidents. Chakkagaa vivarinchavu..
Dr. Kokkonda sudhaker . Gg college 1978 చెప్పారు…
Dear friend
Kudos to openness and expression of your college experience. More or less most of us faced such situations.
Our interest and commitment and rightly supported by the teachers made us to stand on our feet.
I too had such experiences my part 1 application was not forwarded due to shortage of attendance. (Due to Sports and
N C C participation)
Our English lecturer
Mr. veerabhadra chary sir covered by arranging special classes to reach 65% another 10% added by sports quota. 15 days before the exam my application was sent to
O U Through our college superintendent Mr. Parthasarathi
He was also a table tennis player.
I got hall ticket 5 days before the exam in a special cover. I passed both papers to the surprise of many lecturers.
Veerabadhra chary sir
Principal sir congratulated me personally.
Sri. Poornachandra rao sir very cordial.
I used to meet him often in his chamber as a games committe member.
GGC is a great institution.
Few lecturers were helpful. Whom we never forget.
Many were duty minded.
There was a reference book library. After leaving the college I visited only once. A new building in the open area P G block
🙏
M D omprakash చెప్పారు…
Arai, Shyam nee stories really mind blowing, heart beat increasing with happily and really upto now nobody knows your family background & fin.position, family problems, about your life gettingon experience( reality) sharing in a story is super & eye opening. Great 👌🙏 mahajan dhanpal omprakash. Adilabad
Radha krishnan canada చెప్పారు…
Shyam, Thank you for sharing this. Your candid description of all the difficulties you overcame during  your school years was very thoughtful and relatable. It is incredibly brave for you to be so open about your hardships and it is especially great to see you doing so well in life now. Many of us have had to deal with economic issues in our childhood which we have since overcome. Let us appreciate what we have achieved and share our happiness.
Radhakrishnan   . Canada. Bcom 1978 gg college నిజామాబాద్
Steekanth singer star maker చెప్పారు…
Amazing narration. Chaalaa hrudyamgaa vyakta parichaaru. Life lo mimmalni personal gaa kalavaali ani vundi. 🙏🙏🙏
Sreekanth .singer. vjwd
Manohar patil. Cable manufacturers. Hyd చెప్పారు…
These words touched my heart....being Brahman is a curse now a days bcoz of cheap politicians & reservations...very nice writing. Manohar patil. Cable manufacturers. Ramanthapoor.hyd
Satyam HR moldtek hyd చెప్పారు…
As I said earlier, your skills are fabulous and your thoughts are very much appreciated.sataym. HR manager. S
Moldtek plastic. Hyd
Satyanarayana చెప్పారు…
: Infact, your memories will impact majority of people
Keep it up👍
Sateesh. Unit 1 moldtek చెప్పారు…
I really like your skills and way of expressing the content
Mandapaka hanmanth rao vijayawada చెప్పారు…
నిజం చెప్పాలంటే, ఒక మధ్య తరగతి సగటు మనిషి జీవితం అనుక్షణం ఒక పోరాటమే. ఆ వ్యక్తి సమస్యలనే వలయం లో చిక్కుకొని కొట్టు మిట్టాడుతు ఏవిధమైన మానసిక శారీరక ఒత్తిడికి గురికావడం, అనేది, అనుభవించే వారికే తెలుస్తుంది.
ఇంట్లో పెద్దవాడవడం వల్ల అనుక్షణం పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతీ దాన్ని త్యాగం చేయడం, తప్ప వేరే గత్యంతరం లేక సతమత మయ్యే స్థితి, అబ్బో ఊహించు కొంటే నే చాలా బాధాకరం.
సరైన సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని ఇంటివద్ద కలిసి, పరిస్థితిని వివరించగా నే, ఆయన ఏంతో ఔన్నత్యంతో పెద్ద మనసు చేసుకుని ఫీజు రాయితీ ఇవ్వడం అనేది, నీ జీవితంలో మరపు
రాని మరువలేని ఒక గొప్ప మలుపు. ఆ విధమైన సాహాసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఒక్క గురువుకే సాధ్యం. అందుకే అంటారు గురువ ని మించిన దైవం లేదని. వారికి ఆజన్మాంతం కూడా మనం ఋణపడి ఉండాలి, తగిన గురుదక్షిణ చెల్లించు కోవడం తప్ప.
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
నాగ రంజని. Retd professor. చెప్పారు…
Shyaaamgaru
మీరు రాసిన కథ మీ హృదయాన్ని ఆవిష్కరించింది.ఇప్పుడు జరుగుతున్నట్లు అనిపించింది. చాలా ఆర్ద్రంగా వుంది నాన్నగారిపైనున్న మీ ప్రేమకు అద్దం పట్టింది మీ కథ .మీలాంటి ప్రతిభావంతులు చదువుకునే అవకాశం సమాజం కల్పించడం సమాజం బాధ్యత .మీ శైలి చాలా బాగుంది.
నాన్నగారు ఎప్పుడూ విద్యార్థుల బాగు గురించీ, సౌకర్యాలను గురించీ ఆలోచించేవారు . కాలేజీకి దగ్గరదారి ఉండాలని పోరాడి రోడ్డు వేయించారు.ఇలాంటివి చాలవున్నై.చదువుకోవాలనే ఆసక్తి వున్న వాళ్ళకి సహయపడదమే ధర్మం.
నా నంబర్ కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది.కథ పంపినందుకు ధన్యవాదాలు 😊🙏
Venkata kashyap.nicobar చెప్పారు…
Excellent గా వుంది. మంచి ఎమోషన్ క్యారీ చేశారు. మీలో మంచి కల్పనా శక్తీ వుంది. 👌👍💐
Ramesh AO LIC ksmreddy చెప్పారు…
Ramesh Aaokmr L I C Gratuity: Real stories or written stories as writer
I think this real story
Unknown చెప్పారు…
*మనుషుల్లో దేవుడు...*

శ్యామ్ కుమార్ చాగల్ నిజామాబాద్ గారు రాసిన ఈ కథ లో బాగా చదువుకునే ఒక విద్యార్ధి పట్ల ఓ గురువు చూపించిన ఔన్నత్యాన్ని చక్కగా రాసారు

ఇది తన స్వీయ కథే ..

తన జీవితం లో ఎదురైనా సంఘటనలను వివరిస్తూనే, తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహనీయుల గురించి పరిచయం చేస్తూ, రచయిత వారి పట్ల తన కృతజ్ఞతని ఓ కథ రూపంగా వ్యక్త పరిచిన తీరు ఎంతో బావుంది ..

చేసిన మేలు మర్చిపోయే రోజుల్లో ఇలా తనకు సాయం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకోవడం నిజంగా అభినందనీయం ..

తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తండ్రి వృత్తి ని గౌరవిస్తూ ,, చదువుపట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియచేసి, లైబ్రరీ ఇంచార్జ్ ఖాన్ సాబ్ పూచికత్తు తో పుస్తకాలు సంపాదించారు ..

రాధాకృష్ణ సాయంతో ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారు ..

తన ఆర్థిక స్థితి ని.. మీరు అవకాశం ఇస్తే మెరిట్ సాధిస్తా అని చెప్పి ప్రిన్సిపాల్ గారైన శ్రీ పూర్ణ చందర్ రావు గారి తో ఫీజ్ రాయితీ ని పొంది ..

అందరికి చెప్పినట్టు మెరిట్ సాధించారు ..

నేను కూడా, గిరిరాజ్ కాలేజ్ విద్యార్ధి గా ,
శ్రీ పూర్ణచంద్ర రావు,
శ్రీ బసవేశ్వరయ్య లాంటి ఎందఱో పూజ్య గురువులకు ఈ సమీక్ష రూపంగా పాదాభివందనం చేస్తున్నా ..

ఈ కథ గురువుల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మరోసారి గుర్తు చేసింది..

విద్యార్ధికి చేయూత అందించినవాళ్లు అంతా మనుషుల్లో దేవుళ్ళే ..

*గురు దేవో భవః*

కొలను వెంకటేశ్వర రెడ్డి
Rohit Audipudi Venkata చెప్పారు…
Sri Tenneti Purna Chandra Rao garu is my grandfather and I am in debt to God to have been given thr privilege of being in close proximity to him, and to run around his easy chair and to give him water, to sit across his table and ask him questions and listen to him. My life and my consciousness has been built by his Kripa. A great being. And athe epitome of idealism is Purna Chandra Rao garu.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
కవిత నా తోడు;- యలమర్తి అనూరాధ-హైదరాబాద్ -చరవాణి:924726౦206
టక్కరీ టిక్కరీ నక్క - గంగదేవు యాదయ్య
చీర కట్టుకు ఫిదా అయిపోయా!--ప రికిణీ ఓణీలో కనిపించే అమ్మాయిలంటే ఎంతిష్టమో అంతకు రెట్టింపిష్టం చీరకట్టులో ముస్తాబైన మగువను చూడాలంటే. చీర మాట స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఎక్కడో నేను రాసుకున్న కవితొకటి గుర్తుకొస్తోంటుంది.... "నువ్వు చీరలో వస్తుంటే దారిపొడవునా నిన్ను చూసిన వారందరూ శిలలై నిల్చుండిపోయారు! చీరను కట్టుకున్న సంతోషం నీ ముఖంలో చూసాను! నిన్ను కట్టుకున్న సంతోషం చీరంతటా చూసాను! ఇంకా ఎందరి హృదయాలను లేలేత దూదిపిందలల్లే మార్చబోతున్నావో కదూ నీ చీరకట్టులోని అందమైన నవ్వుతో!! చాలమ్మాయి, చాలిక, ఇక లేదు నా దగ్గర కోల్పోయేందుకు మరొక హృదయం....!! నీ చూపులు చీరందంతో పోటీ పడి జరిపే నాటకానికి కిందా మీదా అయిపోయేది నా హృదయమేగా!! అర క్షణంలో పడిపోతాను చీరకట్టులో నిన్ను చూసినప్పుడల్లా!! ఎందుకిలా అనుకుంటున్నానో తెలుసా నీకు నన్ను నేను మరచి...? నేను నాదేనని అనుకున్న మనసుని నీ చీరకట్టుతో నీ వెంటే తీసుకుపోతున్నావు అప్రమేయంగా!! అంతెందుకు ఓమారడిగావు గుర్తుందా "ఈ చీర నాకు బాగుందాని?" అప్పుడు నేనిలా అన్నాను... "బాగుండటమేంటీ, చీర కట్టులో మాత్రమే నీ అందమంతా అందిస్తున్నావు నాకు" అని! అవును, చీరకున్న శక్తి,.ఆకర్షణ అలాంటిది! శ్రీమతి జ్యోతి వలబోజు గారి ప్రేరణతో "సరదా శతకం"గా బ్నింగారు పాఠక లోకానికి అందించిన "చీర పజ్యాలు" మళ్ళీ చదివానిప్పుడు. పరికిణీ మీద కవితలు రాసిన "పరికిణీ వాలా" తణికెళ్ళ భరణిగారు "చీరని ఉతికి ఆరేయకుండా, చీరని చిరాకు పడే వాళ్ళని ఉతికి, చీరకి కుచ్చిల్లు పెట్టిన బ్నింగారికి "త్రీ ఛీర్స్" అనడం పట్టుచీరకున్నంత అందంగా ఉంది.బ్నింగారు మాటలతో మురిపిస్తారు. మరిపిస్తారు. ఓసారి ఆయనతో పరిచయమైతే మళ్ళీ మళ్ళీ ఆయన మాటలు వినడానికి మనసు ఉవ్విళ్ళూరుతుంంటుందనడం అతిశయోక్తి కాదు. తల్లావజ్ఝల లలితాప్రసాద్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్న మరుక్షణమే బ్నింగారికి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వారింటికి కలియడంతో మా మధ్య పరిచయం శ్రీకారం చుట్టుకుంది. అదిప్పటికీ హాయిగా ఆనందంగా కొనసాగుతోంది."చీరపజ్యాల" రచనా శతకానికి శతక లక్షణమైన "మకుటం" లేనందువల్ల దీనిని శతకమనలేమని, కనుకే "సరదా శతకం"గా బ్నింగారు పద్యాల నడకను చదివి తరించవచ్చన్న డా. అక్కిరాజు సుందర రామకృష్ణగారి మాట అక్షరసత్యం."ఫెమినిస్టుని కాదుగానీ ఫెమిన్ ఇష్టున్ని అని చెప్పుకున్న బ్నింగారికి స్త్రీత్వం మీద విపరీతమైన ఇష్టమూ! గౌరవమూ!! చీరలంటే ఇష్టమున్న బ్నింగారు తమ ముందుకు అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుని రావడానికి భయపడేలా మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తారు. తన సరదా శతకంలో కొన్ని పద్యాలు పేలాయని, కొన్ని పెట్రేగాయని చెప్పినప్పటికీ చీరందంలోని సొగసుని చాటి చెప్పడానికి బ్నింగారి శైలితో, భావంతో ఏకీభవించని వారుండరు. "బాపూ రమణల సినిమాల్ చూపెట్టును తెలుగుతనము జూమ్ షాట్లలోఆ పిక్చర్లో తరచుగ ఓ పాటనొ సీనులోనొ ఒదుగున్ చీరే!" అంటూ మొదలుపెట్టిన చీరపజ్యాల శతకాన్ని "చీరలపై శతకాన్ని వెరెవ్వరు రాయలేదు వింతే కాదా వారెవ్వా! నా బ్రైన్ లో ఊరించే చీర మడతలున్నా యింకాన్" తో ముగించారు.. ఇందులోని ప్రతి పద్యమూ చదివి ఆర్థం చేసుకోవడానికి శబ్దరత్నాకరమో శబ్దార్ద చంద్రికో లేక మరే నిఘంటువో అవసరం లేదు. అన్ని మాటలూ మన చుట్టూ మనతో మనలో ఉన్నవే. కనుక వాటిని చదువుతున్న కొద్దీ చీరకట్టుకున్న ప్రాధాన్యం విదితమవుతుంది. వారంరోజుల్లో ఈ చీర శతకాన్ని బ్నింగారు నేసిన సమయంలో రెండు సార్లు బ్నింగారిని కలిశాను. ఈ పుస్తకం ఇన్ సైడ్ కవర్లలో ఆయన వేసిన రెండు కార్టూన్లను వేస్తున్నప్పుడు ఎదుటే ఉన్నాను.వాటిలో ఒకటి - "అరుస్తారెందుకు? నా కన్నా చీరలే మీకిష్టం కదా....కులకండి! అంటూ చీరల ట్రంకుపెట్టెలో ఉన్న భర్తతో భార్య చెప్తున్నటువంటి ఈ మాటలు బలే పేలాయి. ఇక రెండో కార్టూనుకి "చీరలు కొనమని భార్యలు / ఊరకనే కోరబోరు - ఉందురు ఓర్పున్ / వారల అవసర మెరిగియు / మీరే తెచ్చివ్వ వలయు మేలగు నేస్తం" అంటూ అందించిన పద్యం మజాగా ఉంది.ప్రతి పద్యంలోనూ బ్నింగారు పలికించిన భావం "చీరకట్టులో ముచ్చటగా, ముద్దుగా కనిపించే సొగసైన కన్యలా" ఉంది.చీరలపై పుట్టిన సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో చీరందాలను ఎంతలా అభివర్ణించారో అందరికీ విదితమే."చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా" అని ఒకరంటే "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...." అని మరొక కవి మాట. అయితే ఇంకొక కవి "జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గొచ్చింది...." అనడం ఎంత బాగుందో కదండీ. చీరంటే మాటలా! కనుక చీర పజ్యాలనొక్కసారైనా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా స్త్రీలు చదివితే బాగుంటుందని నా మాట.- యామిజాల జగదీశ్
చిత్రం
సగటు మనిషి ఆవేదన- సాహితీ సింధు, పద్య గుణవతి సరళగున్నాల