మహా వీరుడు బందా వైరాగీ!--అచ్యుతుని రాజ్యశ్రీ

 పుంఛకీ కొండప్రాంత జమీందారీలోని రాజోర్ ఒక పల్లె. అక్కడే రాజపుత్రవీరుడు లక్ష్మణదేవ్ జన్మించాడు.  ఔరంగజేబు క్రూరపాలనతో జనం త్రాహి త్రాహి అంటున్న రోజులవి.విలువిద్యలో నిపుణుడైన  ఆపిల్లాడు ఒకసారి  గర్భవతి ఐన లేడిని చంపాడు. దాని పొట్టను చీల్చాడు. అందులో బుల్లి జింక పిల్ల ఉండటం చూసి  దు:ఖంతో పొర్లి పొర్లి ఏడ్చాడు. వైరాగ్యం బాధ తో కుళ్ళి కృశిస్తున్న వాడిని  జానకీదాస్ అనే సాధువు  లాహోర్ తీసుకెళ్ళాడు.అతని పేరుని మాధవదాస్ గా మార్చాడు. మాధవ్ యాత్రలు చేస్తూ పంచవటి చేరాడు.అక్కడ తపస్సు చేస్తున్న అతనికి దైవీశక్తులున్నాయని జనం నమ్మి భక్తి తో కొలిచేవారు. అప్పుడు అతని వయసు కేవలం 22ఏళ్ళు మాత్రమే. 
గోదావరి తటంపై ఉన్న నావేర్ ప్రాంతం అంతా అతని పేరు మార్మోగింది. గురుగోవిందసింహ్  వైరాగిని కలసి దేశంలో ని  మొగల్ ల అరాచకత్వం ని గూర్చి వివరించటంతో తన 36వ ఏట బాబా బందాగా మాతృభూమి సేవకై నడుం బిగించాడు. పంజాబ్ లోని వివిధ ప్రాంతాలు
భరత్పుర్ ఖండా నగరోటా టోహనా లలో  పర్యటించాడు. యవనులతో యుద్ధం చేయటం కోసం  సైన్యం ని సమీకరించాడు.వైరాగ్యభావంని వీడి గెరిల్లా యుద్ధం చేస్తూ కొండల్లో దాగేవాడు.అతనిసైన్యం అంబాలా దామల్ కైథల్ మొదలైన ప్రాంతాలని లూటీచేశారు. హటియా అనే గ్రామంలో  గోవధను అడ్డుకున్నాడు.యవన సైన్యం ని మట్టుబెట్టి తన సైన్యం తో సఢోరా నగరం చేరాడు. అక్కడ   ఉస్మాన్ఖాన్ అనే గ్రామపెద్ద హిందూ స్త్రీలని సతాయిస్తుంటే  సిక్కు సైన్యం బాణా లతో
వారిని తుదముట్టించింది. ఉస్మాన్ ఖాన్ ని చెట్టుకి కట్టి చంపారు. చాలా మంది యువకులు  బందాసైన్యంలో చేరారు.  ముసల్మానుల అత్యాచారాలు ఆగడాలు  మితిమీరసాగాయి.కొంత మంది ముస్లింలు నమ్మకద్రోహం చేసే తలంపుతో బందాసైన్యంలో చేరారు.  సర్హింద్ నవాబు కి వారు రాసిన లేఖలో ఈవిషయం బైట పడటంతో వారిని అక్కడే మట్టుబెట్టాడు.సర్హింద్ లోనే  గురుగోవిందసింహ్ ని ఇద్దరు కొడుకులను గోడలమధ్య నిలబెట్టి  సజీవ సమాధి చేశారు తురుష్కులు.ఈవిషయం తెలుసుకున్న బందా రక్తం సలసల మరిగింది.1765లో జరిగిన యుద్ధం లో  సుబేదార్ వజీర్ఖాన్ ని బందీగా పట్టుకున్నారు. సిక్కులు అలగావ్ ఖేంకర్మ చూడియా మొదలైన ప్రాంతాలలో  రాజ్యాలు నెలకొల్పారు.  గురుగోవిందసింహ్ తర్వాత  బందావైరాగిని తమ 11వ గురువు గా  సిక్కులు స్వీకరించారు. యమునా రావినదుల మధ్య ప్రాంతంలో ఈహిందూ సన్యాసి  విజయఢంకా మోగించాడు.ఔరంగజేబు కొడుకు  పెత్తనం చెలాయించాలని చూశాడు కానీ  అతని ఆటలు సాగలేదు.  తను గెల్చిన ప్రాంతాల్లో సిక్కు సర్దార్లను నియమించి  తాను తపస్సు లో మునిగేవాడు బందా!దీనితో ముస్లిం దురహంకారులుచెలరేగారు.
సిక్కులు తమలోతాము కలహించుకోటంతో మళ్లీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి ఐంది.బందా వైరాగీని ఇనపగొలుసులతో తురుష్కులు  ఢిల్లీలో బందీగా ఉంచారు. ఆయనని ఏనుగుల తో తొక్కించి చంపారు. ఆత్మకి సుఖదుఃఖాలు లేవు అని నమ్మి న ఒక తాపసి  హిందూ ధర్మం కోసం బలి అయిన  బందా వైరాగీ సదా స్మరణీయుడు.
కామెంట్‌లు