పితామహుడు(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 అనుబంధాల,ఆప్యాయతల
చిరునామా ఆయన.
తరాల అంతరాలకు సాక్ష్యం.
అనుభవం,ఆలోచనల నిధి.
కొడుకుల,కోడళ్ళ,కూతుళ్ళ,
అల్లుళ్ళ,మనుమల,మనుమరాళ్ళకు అందరివాడు.
పెద్దరికంతో హుంకరించినా,
ప్రేమతో దగ్గరికి తీసుకున్నా,
ఆ గాఢ పరిష్వంగమే,
ఎన్నోజన్మల పెన్నిధై దర్శనమిస్తుంది.
తాత తరతరాల వాటా.
అభిమానాల ఊట.
కామెంట్‌లు