గాఢత క్రిములకు నాశన మగును
మామిడి ఆకుల తోరణ మెంత
ఆరోగ్యకరమూ శుభము లగును!
వాకిట సానుపు పచ్చని కళగ
ముగ్గుల శోభకు మెత్తురు జనము
ఒత్తిడి తొలగే చక్కని దారి
మహిళా సృజనలు మేటివి ఘనము!
ముంగిలి లోపల పువ్వుల తోట
ముచ్చట కలిగే కనులకు విందు
ఋతువుల బట్టీ మొక్కలు నాటు
లక్ష్మి దేవివి దీవెన లందు !
చిమ్మిన ఇంటికి కళయే వచ్చు
తుడిచిన చల్లని అనుభవమేగ
వస్తువు పొందిక సర్దుట లోనె
అరలును ఉండుట అందుకేనుగ!
నిత్యం స్నానం దీపం పూజ
దైవం పట్లను నమ్మిక ఉంచు
ప్రసాద మంటే పంచుట కొరకు
ఆనందములను నీవే పంచు!
శుచిగా వంటలు సూత్రం మడియె
ఆచారములకు మూలం కాగ
ఇంటిని చూడ ఇల్లాలి తీరు
చెయ్యెత్తి మొక్కుదామను కోగ!
ఎప్పటికప్పుడు పనులను చేయి
వంటికి మనసుకు యెంతో మేలు
కోపం అరుపులు దూరం పెట్టు
బీపీ షుగరులు రావిక చాలు!
పనులకు అలసట చెందిన తరిని
లలితపు కళలను సాధన చేయి
సన్నగ పాడిన తీయని పాట
మనసుకు కుదుటను ఇచ్చుకదోయి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి